Madhya Pradesh: తీవ్ర విషాదం.. బోరులో పడిన బాలుడు మృతి, 24 గంటల తర్వాత అపస్మారక స్థితిలో బయటకు, చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

లోకేష్ అహిర్వార్ అనే బాలుడు మంగళవారం పొలంలో ఆడుకుంటూ 45 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. అహిర్వార్‌ను బయటకు తీయడానికి తవ్విన 50 అడుగుల సమాంతర గొయ్యి ద్వారా 24 గంటల తర్వాత రక్షించబడ్డాడు.

Boy Falls Into Borewell in Vidisha. (Photo Credits: ANI)

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో బోరుబావిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. లోకేష్ అహిర్వార్ అనే బాలుడు మంగళవారం పొలంలో ఆడుకుంటూ 45 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. అహిర్వార్‌ను బయటకు తీయడానికి తవ్విన 50 అడుగుల సమాంతర గొయ్యి ద్వారా 24 గంటల తర్వాత రక్షించబడ్డాడు. రక్షించినప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న అహిర్వార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Here's Update