Madhya Pradesh: బాలికపై 55 ఏళ్ళ వృద్ధుడి లైంగిక వేధింపులు, అతన్ని చంపి, ఆ శవాన్ని ముక్కలుగా నరికి నదిలో పారేసిన బాధితురాలి తండ్రి, మేనమామ, ఎంపీలో దారుణ ఘటన
మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది.మైనర్ బాలికను లైంగిక వేధింపులకు (Man accused of sexually abusing minor) గురిచేస్తున్న వ్యక్తిని బాధితురాలి తండ్రి హతమార్చి అతడి మృతదేహాన్ని ముక్కలుగా కోసి నదిలో పడేయడం (killed by victim’s father in Madhya Pradesh) కలకలం రేపింది.
Khandwa, May 29: మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది.మైనర్ బాలికను లైంగిక వేధింపులకు (Man accused of sexually abusing minor) గురిచేస్తున్న వ్యక్తిని బాధితురాలి తండ్రి హతమార్చి అతడి మృతదేహాన్ని ముక్కలుగా కోసి నదిలో పడేయడం (killed by victim’s father in Madhya Pradesh) కలకలం రేపింది. అజ్నల్ నదిలో ఆదివారం వ్యక్తి మృతదేహం బయటపడింది. పిటిఐ కథనం ప్రకారం, బాధితురాలి తండ్రి, మామ హత్య చేసిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.
జిల్లా కేంద్రం నుంచి ఈ నది 40 కిలోమీటర్ల దూరంలో ఉందని సక్తాపూర్ గ్రామానికి చెందిన మృతుడిని(55) త్రిలోక్చంద్గా గుర్తించినప్పటి నుంచి మృతదేహం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. మృతుడు మైనర్ బాలికను (14) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు వెల్లడైందని చెప్పారు. బాలికను వేధిస్తున్న త్రిలోక్చంద్ (55)ను బాధితురాలి తండ్రి, మేనమామ శనివారం తమ బైక్పై కూర్చుండబెట్టుకుని అజ్నల్ నది వద్దకు తీసుకువెళ్లారు. ఆపై తల తెగనరికి మొండేన్ని చేపలు కోసే పరికరంతో రెండు ముక్కలు చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, ఇతరుల పాత్రపైనా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు, మృతుడు బంధువలని గుర్తించామని పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. మృతుడి నేపథ్యాన్ని పరిశీలించగా అతడు 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలిందని సబ్ డివిజనల్ అధికారి రాకేష్ పెండ్రో తెలిపారు.