Madhya Pradesh Shocker: టవల్ ఇవ్వలేదని భార్యను చంపేశాడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘటన, ఇక తమిళనాడులో మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేసిన యువకుడు, నిందితులు అరెస్ట్

స్నానం చేశాక ట‌వ‌ల్ అడిగితే ఇవ్వ‌లేద‌ని భార్య‌ను పారతో కొట్టి (Madhya Pradesh Shocker) చంపాడు. ఈ ఘ‌ట‌న బాలాఘాట్ జిల్లాలోని కిర‌ణ్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. నిందితుడు రాజ్‌కుమార్ బాహే అట‌వీశాఖ‌లో రోజువారీ కూలీగా ప‌నిచేస్తున్నాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Bhopal, Nov 8: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నానం చేశాక ట‌వ‌ల్ అడిగితే ఇవ్వ‌లేద‌ని భార్య‌ను పారతో కొట్టి (Madhya Pradesh Shocker) చంపాడు. ఈ ఘ‌ట‌న బాలాఘాట్ జిల్లాలోని కిర‌ణ్‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. నిందితుడు రాజ్‌కుమార్ బాహే అట‌వీశాఖ‌లో రోజువారీ కూలీగా ప‌నిచేస్తున్నాడు. అయితే డ్యూటీ ముగిశాక ఇంటికి వ‌చ్చిన అత‌ను స్నానం చేసి త‌న భార్య పుష్పా భాయ్‌ని కొట్టాడు.

గిన్నెలు శుభ్రం చేస్తున్న ఆమె.. కాసేపు అయ్యాక ట‌వ‌ల్ ఇస్తాన‌ని చెప్పింది. కానీ లోపు ఆవేశానికి గురైన భ‌ర్త రాజ్‌కుమార్‌.. భార్య‌ను ఓ పారతో (man kills wife for delay in giving him towel after bath) చిత‌క‌బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తండ్రిని అడ్డుకోబోయిన కూతుర్ని బెదిరించాడు. పోస్టుమార్ట‌మ్ నిర్వ‌హించిన పోలీసులు పుష్పా భాయ్ మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు న‌మోదు చేశారు.

ఇక తమిళనాడులో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని ఆదివారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సేలం జిల్లా కరుమందురైకు చెందిన వృద్ధురాలు మేకలు మేపుతూ జీవనం సాగిస్తోంది. శనివారం సాయంత్రం పొలంలో మేకలు మేపుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం (25) మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునే లోగా షణ్ముగం పరారయ్యాడు. కరుమందురై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి తెలిపారు.

పక్కింటి అమ్మాయిని రెండు నెలల పాటు గదిలో కట్టేసి, తండ్రి, కొడుకులు కలిసి లైంగిక దాడి, వద్దని వారించినా వినకుండా రాక్షసత్వం...

చెన్నై అంబత్తూరులో 15 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల వ్యవహారంలో తల్లిని ఆమె వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కొరట్టూరు రైల్వేస్టేషన్‌ రోడ్డుకు చెందిన ప్రియాంక(37) భర్త నరేష్‌ కుమార్‌తో మూడేళ్ల క్రితం విడిపోయింది. రెండేళ్ల నుంచి అంత్తూరు తిరువెంకటనగర్‌కు చెందిన సందీప్‌తో సహజీవనం చేస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియాంక కుమార్తె(15)పై సందీప్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి ప్రియాంక సహకరించింది. దీనిపై జిల్లా బాలిక సంరక్షణ భద్రత అధికారి జేమ్స్‌కుమార్‌కు సమాచారం అందింది. ఆయన అంబత్తూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌జ్యోతిలక్ష్మి ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేసింది.