Mumbai COVID-19: ముంబైలో కరోనా కల్లోలం, 23 మంది పోలీసులకు కరోనా పాజిటివ్, మహారాష్ట్రలో 3205కు చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసు అధికారులతో సహా మరో 16మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే పలుచోట్ల ఆసుపత్రుల్లో చేరిన 23 మంది పోలీసులు కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు.

Mumbai Police. (Photo Credits: PTI)

Mumbai, April 16: కరోనా ను కట్టడిచేసెందుకు ఒక పక్క ప్రజలు, ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తుంటే మరోపక్క ఈ కరోనా వైరస్ (coronavirus) ఏటువైపు నుంచి వస్తుందో అర్దం కాకుండా చొచ్చుకొస్తుంది ఇప్పటికే కరోనా సోకిన వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్స్ లు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు వారే కాకుండా కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసే పోలీసులకు ఇది సోకడం ప్రారంభించింది.

ఆగని కరోనా మరణాలు, దేశ వ్యాప్తంగా 437 మంది మృతి, 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

ముంబై నగరంలో (Mumbai COVID-19) భాద్యతలు నిర్వహిస్తున్న 15మంది పోలీసులకు (23 Police Personnel) కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసు అధికారులతో సహా మరో 16మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే పలుచోట్ల ఆసుపత్రుల్లో చేరిన 23 మంది పోలీసులు కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు.

కరోనావైరస్ రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్

కాగా.. ప్రతీ జిల్లాలోనూ పోలీసుల కోసం ప్రత్యేకంగా మొబైల్ డిస్ ఇన్పెక్షన్ వ్యాన్ ను ఏర్పాటుచేశారు. లాక్ డౌన్ సందర్భంగా 97 మంది పోలీసులపై దాడి చేసిన 162మందిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 46,671 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారిలో 9,155మందిని అరెస్టు చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన 31,296 వాహనాలను సీజ్ చేసి, ఉల్లంఘనుల నుంచి రూ.1.7 కోట్ల జరిమానాను పోలీసులు వసూలు చేశారు.

గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ధారావి, కొత్తగా 11 కేసులు నమోదు

31,296 వాహనాలను సీజ్ చేసి, ఉల్లంఘనుల నుంచి రూ.1.7 కోట్ల జరిమానాను పోలీసులు వసూలు చేశారు. అయితే ఒకపక్క లాక్ డౌన్ ను సురక్షితంగా పాటించడానికి ప్రజలను రక్షించే పోలీసులకు కరోనా వైరస్ సోకడం వల్ల వారి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్రలో ఒక్కసారిగా 23 మంది పోలీసులకు ఈ వైరస్ సోకడం సంచలనం రేపింది.

మార్చి 22 నుంచి కనీసం ఏడుగురు పోలీసు అధికారులు, 16 మంది కానిస్టేబుళ్లు ఈ వైరస్ సంక్రమణ బారిన పడినట్లు గుర్తించారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. కాగా ప్రతి జిల్లాలోని పోలీసులకు మొబైల్ క్రిమిసంహారక వ్యాన్లు అందించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ అమలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలోని పోలీసులు కూడా దాడులను ఎదుర్కొన్నారు. 97 మంది పోలీసు సిబ్బందిపై సంఘ విద్రోహులు దాడి చేశారని, ఈ కేసుల్లో 162 మందిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

మహారాష్ట్రలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3205కు చేరింది. మరణాల సంఖ్య 194కు చేరువైంది. ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన 1400 మందిని గుర్తించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మహారాష్ట్రలో అధికారులు పూల్ టెస్టింగ్‌కు సిద్ధమవుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif