New Delhi, April 17: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మరణాలు ఆగడం లేదు. కొవిడ్-19 (COVID 19) కట్టడికి పటిష్ట చర్యలు కొనసాగుతున్నా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 437 మంది మృతి (Coronavirus Death Toll) చెందారు. మొత్తం 13,387 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. దేశంలో 1,749 మంది కోలుకోగా, 11,200 పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1007 నమోదు కాగా 23 మంది చనిపోయారు.
కరోనావైరస్ రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ట్రీట్‌మెంట్
మహారాష్ట్రలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3205కు చేరింది. మరణాల సంఖ్య 194కు చేరువైంది. ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన 1400 మందిని గుర్తించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మహారాష్ట్రలో అధికారులు పూల్ టెస్టింగ్‌కు సిద్ధమవుతున్నారు. దేశ రాజధానిలో 1,630 మంది సోకిన 38 మంది, 38 మంది మరణించడంతో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. 1,267 పాజిటివ్ కేసులతో మూడో స్థానంలో తమిళనాడు ఉంది.తమిళనాడు రాష్ట్రంలో 15 మంది మరణించారు
గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ధారావి, కొత్తగా 11 కేసులు నమోదు
కరోనా మరణాలకు సంబంధించి మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ నిలిచింది. 53 మంది కొవిడ్‌తో మరణించారు. గుజరాత్‌లో 36 మంది కరోనాతో చనిపోతే, ఢిల్లీలో 38 కొవిడ్ మరణాలు సంభవించాయి. కర్నాటక, పంజాబ్, యూపీలలో 13 మంది చొప్పున కరోనాకు బలయ్యారు.
Check tweet on the numbers shared the Ministry of Health and Family Welfare:
India's total number of #Coronavirus positive cases rises to 13,387 (including 11201 active cases, 1749 cured/discharged/migrated and 437 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/GheWAdYrSS
— ANI (@ANI) April 17, 2020
ఓ పక్క దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..ఆ ఆదేశాలు కర్నాటకలోని కల్బుర్గిలో బేఖాతరయ్యాయి. సిద్ధలింగేశ్వర రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం కల్బుర్గి కరోనా హాట్‌స్పాట్‌లో ఉంది. ఈ జిల్లాలో మొత్తం ముగ్గురు కరోనాతో మరణించారు. రథోత్సవంలో పాల్గొన్న 20 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఆలయ నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు.
కరోనా భయంతో ఇండోర్‌లో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కరెన్సీని రోడ్డుపై పడేశాడు. వంద, రెండు వందలు, ఐదు వందలు విలువైన 25 నోట్లను పడేసినట్లు గుర్తించారు. అయితే పాడేసిన నోట్లను ముట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి కరోనా నిరోధక ద్రావం చల్లి ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో వచ్చిన వ్యక్తి కరెన్సీని పడేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,164 కరోనా కేసులు నమోదు అయితే వాటిలో 707 కేసులు ఇండోర్‌కు చెందినవే.