Maharashtra Police: మహారాష్ట్రలో 4,103 మంది పోలీసులకు కరోనా, 24 గంటల్లో 55 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, మొత్తం 48 మంది కరోనాతో మృతి

ఈ వైరస్ అక్కడ పోలీసుల్ని (Maharashtra Police) హడలెత్తిస్తోంది. గడిచిని 24 గంటల్లో 55 మందికి (New COVID-19 Cases) కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు చనిపోయారు.

Mumbai Police. (Photo Credits: PTI)

Mumbai, June 22: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు(2020 Coronavirus Pandemic in India) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ అక్కడ పోలీసుల్ని (Maharashtra Police) హడలెత్తిస్తోంది. గడిచిని 24 గంటల్లో 55 మందికి (New COVID-19 Cases) కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు చనిపోయారు. గోవాలో తొలి కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 818కి చేరిన మొత్లం కోవిడ్-19 కేసుల సంఖ్య, జలపాతాలకు వెళ్లే మార్గాలను మూసివేసిన అధికారులు

ఇప్పటివరకూ మొత్తం 3,039 మంది పోలీసులు కోలుకోగా, 1,106 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మొదటిసారిగా మహారాష్ట్రలోని ముంబై సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్‌లో జూన్‌ 21న కరోనాతో బాధపడుతూ స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన పోలీస్‌ చనిపోయాడు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమలు నాటి నుంచి ఇప్పటి వరకు నిబంధనలు అతిక్రమించిన 27వేల 446మందిని అరెస్టు చేశామని, 83,970 వాహనాలను సీజ్‌ చేశామని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వీరిపై ఐపీపీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి సుమారు 8కోట్ల 41లక్షల 32వేల 461 రూపాయల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతమవుతుండడంతో ప్రభుత్వం ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ పొడిగించి, సులుభమైన నిషేధపు ఆజ్ఞలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 1,32,075 కరోనా బారినపడగా 6,170మంది మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ వెల్లడించింది.