Panaji,June 22: గోవాలొ కరోనా (Coronavirus in Goa) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా గోవాలో తొలి కరోనా మరణం (Goa Records First Covid-19 Death) నమోదైంది. మోర్లెమ్‌కు చెందిన 85 ఏండ్ల మహిళకు కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం చనిపోయినట్లు (85-Year-Old Woman Passes Away) గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కరోనావైరస్ రహితంగా పేర్కొన్న గోవాలో గత నెల నుంచి వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి
ఆదివారం కొత్తగా 64 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో గోవాలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 818కి చేరింది. ఇందులో 683 మంది చికిత్స పొందుతుండగా 135 మంది కోలుకున్నారు. ఆదివారం ఆరుగురు కరోనా రోగులను డిశ్చార్జ్ చేశారు. మరోవైపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటి నుంచి గోవాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఈ రైళ్లను నిలుపవద్దని సీఎం ప్రమోద్ సావంత్ ఇటీవల రైల్వేను కోరారు. చైనాకు మరో భారీ షాక్, రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను రద్దు చేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
కర్ణాటకలోని బెలగావీ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దులును మూసివేసి, రాష్ట్రంలోకి వచ్చినవారిని గోవా అధికారులు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. బెలగావీ నుంచే గోవాకు కూరగాయలు, పండ్లు పెద్ద సంఖ్యలో వస్తాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..గోవాకు బెలగావీ కీలకం కావడంతో పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జలపాతాలకు వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. పర్యాటకులు అధిక మంది ఈ వర్షాకాలంలో వస్తారని, పరిసర ప్రాంతాలను అపరిశుభ్రంగా మార్చివేస్తారని అంచనా వేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అది..వ్యాప్తి చెందుతుందని భావించి జాగ్రత్త పడుతున్నారు. కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం
భారత్‌లో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు నాలుగు లక్షల 25 వేలు దాటేశాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4,25,282 కేసులు నమోదవగా.. 13,699 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 1,74,387 యాక్టివ్ కేసులున్నాయి. 2,37,196 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 14,821 కేసులు నమోదవగా.. 445 మంది మృతి మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.