Maharashtra Chief Minister Uddhav Thackeray (Photo-PTI)

Mumbai, June 22: సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు(India-China Tensions) పాల్పడుతున్న సంగతి విదితమే. బార్డర్లో అనుక్షణం ఘర్షణలకు కేంద్రబిందువుగా మారి మన జవాన్లను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి (China) భారీ షాక్‌ ఇచ్చింది. రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను (3 Chinese Projects) నిలిపివేసింది. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని

కరోనావైరస్ (COVID-19 Pandemic) అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టేందుకు ’మ్యాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0’కు (Magnetic Maharashtra 2.0) సంకీర్ణ ప్రభుత్వం (Maha Vikas Aghadhi Government) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలోని పలు కంపెనీలతోపాటు అమెరికా, సింగపూర్‌, దక్షిణ కొరియా, చైనాకు చెందిన సంస్థలతో 12 ఒప్పందాలు చేసుకున్నది. మూడు చైనా కంపెనీలైన హెంగ్లీ ఇంజనీరింగ్, పిఎమ్‌ఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ జెవి విత్ ఫోటాన్, గ్రేట్ వాల్ మోటార్స్‌తో పూణే జిల్లాలోని తలేగావ్‌లో పెట్టుబడులు పెట్టడానికి జూన్‌ 17న మూడు ఎంవోయూలను మహారాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నది. చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్‌ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ పరిస్థితులు ఇలా ఉంటే లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. చైనా వస్తువులతోపాటు ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ ఊపందుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రూ. 5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ఇప్పటికే చైనా కంపెనీతో కుదుర్చుకున్న రూ.470 కోట్ల సిగ్నల్‌ కాంట్రాక్టును రైల్వే శాఖ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడాలని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌తోపాటు అన్ని టెలికాం సంస్థలకు టెలికాం మంత్రిత్వశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.