Maharashtra Police: పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, మహారాష్ట్రలో మొత్తం 14,953 మంది పోలీసులకు కరోనా, తాజాగా 161 మంది పోలీసులకు కోవిడ్-19, మొత్తం 154 మంది మృత్యువాత
గత 24 గంటల్లో కొత్తగా 161 మంది పోలీసులు కరోనా (Covid to Maharashtra Police) బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా కేసుల సంఖ్య 14,953కి చేరింది. వీటిలో 2,800 యాక్టివ్ కేసులు ఉండగా, 11,999 మందికి పూర్తి స్వస్థత చేకూరింది. ఇంతవరకూ 154 మంది పోలీసులు కరోనాతో మృత్యువాత (Coronavirus Deaths) పడ్డారు. అయితే ఇప్పటి వరకు 11,999 మంది కాప్స్ కరోనా నుంచి కోలుకున్నారు.
Mumbai, August 30: మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిని (Maharashtra Police) కరోనా వెంటాడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 161 మంది పోలీసులు కరోనా (Covid to Maharashtra Police) బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా కేసుల సంఖ్య 14,953కి చేరింది. వీటిలో 2,800 యాక్టివ్ కేసులు ఉండగా, 11,999 మందికి పూర్తి స్వస్థత చేకూరింది. ఇంతవరకూ 154 మంది పోలీసులు కరోనాతో మృత్యువాత (Coronavirus Deaths) పడ్డారు. అయితే ఇప్పటి వరకు 11,999 మంది కాప్స్ కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం 2,800 యాక్టివ్ కేసులు ఉండగా వారంతా చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల పరంగా దేశంలోనే తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7.64 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 24 వేలకుపైగా మరణించారు.మహారాష్ట్రలో శనివారం అత్యధికంగా 16,867 కేసులు నమోదయ్యాయి.బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరుకోగా, వీరిలో 27,13,934 మంది పూర్తి స్వస్థతతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు. మృతుల సంఖ్య 63,498కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 78,761 కరోనా కేసులు నమోదు కాగా, 948 మంది మృతి చెందారు.
Maharashtra Corona Report
ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని కరోనా వైరస్ కారణంగా ముగ్గురు వైద్యులు మృతి చెందారు. అకోలా, బుల్ధనా, భూసావల్ జిల్లాలకు చెందిన ఈ వైద్యులు కరోనా కాటుకు బలయ్యారు. మహారాష్ట్రలో మొత్తం 7 లక్షల 64 వేల 281 కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో 292 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్ కారణంగా మృతిచెందారు.
రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 26 మంది వైద్యులు కోవిడ్ -19కు బలయ్యారు. తాజాగా అకోలా జిల్లాకు చెందిన డాక్టర్ వివేక్ ఫడ్కే (55) బుల్ధానా జిల్లాకు చెందిన డాక్టర్ గోపాల్ క్షీరసాగర్(37) భూసావల్ జిల్లాకు చెందిన వైద్యుడు ఉమేష్ మనోహర్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.