Maharashtra: చికెన్ లేదన్నందుకు ఏకంగా డాబానే తగలబెట్టేశారు, మహారాష్ట్రలో ఘటన, తమిళనాడులో రైలు బోగీలోనే మహిళపై అత్యాచారం చేసిన ఇద్దరు కార్మికులు

ఇద్దరు తాగుబోతులు తాగిన మైకంలో ఏకంగా డాబానే తగలబెట్టేశారు. దీనికి కారణం చికిన్ లేదని యజమాని చెప్పడమే..

Fire (Representational image) Photo Credits: Flickr)

Nagpur, Jan 11: మహారాష్ట్ర నాగపూర్‌లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు తాగుబోతులు తాగిన మైకంలో ఏకంగా డాబానే తగలబెట్టేశారు. దీనికి కారణం చికిన్ లేదని యజమాని చెప్పడమే.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకర్‌ తైదే, సాగర్‌ పాటెల్‌లు ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో నాగ్‌పూర్‌, బెల్‌ట్రోడీలోని ఓ డాబాకు వెళ్లారు. చికెన్‌ ఆర్డర్‌ చేశారు.

అయితే డాబాలో చికెన్‌ లేకపోవటంతో (Denied chicken) అదే విషయాన్ని వారికి చెప్పాడు డాబా యజమాని. దీంతో వారు అతడితో వాగ్వివాదానికి (petty issue) దిగారు. అనంతరం డాబాకు నిప్పంటించారు. యజమాని కళ్లముందే డాబా కాలి బూడిదైంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే రైలు బోగీలో ఆదమరిచి నిద్రిస్తున్న మహిళపై ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్‌ కార్మికులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన 40 ఏళ్ల వివాహిత జీవనాధారం కోసం లోకల్‌ రైలు బోగీలో పళ్లు అమ్ముతుంది. చెంగల్పట్టు–చెన్నై తాంబరం మధ్య తిరిగే లోకల్‌ రైల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మకాలు సాగించి తిరిగి ఇంటికి చేరుకునేందుకు తాంబరంలో చెంగల్పట్టు రైలు ఎక్కింది.

అక్రమ సంబంధం, నీ మరదల్ని చంపేశా వెళ్లి చూసుకో అంటూ బావకి ఫోన్, అనంతపురంలో విషాద ఘటన, అనాధలైన ఇద్దరు పిల్లలు

ఉదయం నుంచి కష్టం చేయడంతో నిద్రపట్టేయగా చెంగల్పట్టు వచ్చినా దిగలేదు. దీంతో అదే రైలు చివరి ట్రిప్పుగా అర్ధరాత్రి వేళ మళ్లీ తాంబరానికి చేరుకుంది. రైలు బోగీలను శుభ్రం చేసేందుకు వచ్చిన ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు ఆమెను తట్టిలేపి నోరుగట్టిగా మూసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే రైల్వే సొత్తును చోరీ చేస్తున్నావని కేసులు బనాయిస్తామని బెదిరించారు. శనివారం తెల్లారగానే తాంబరం రైల్వేపోలీసు స్టేషన్‌కు వెళ్లి బాధితురాలు ఫిర్యాదు చేయగా, కాంట్రాక్టు కార్మికులు సురేష్‌ (31), ఖలీల్‌ (30)లను ఆదివారం అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు