Anantapur, Jan 11: ఏపీలో అనంతపురం నగరంలో అక్రమ సంబంధం మహిళ హత్యకు దారి తీసింది. ఆ మహిళ హత్యతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌తేజ్, యశ్వంత్ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం వీరిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు.
విడిపోయిన అనంతరం (Anantapur) బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి..అది కాస్తా సహజీవనంగా మారింది. రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో వీరు ఇద్దరూ నివాసముంటున్నారు. కాగా యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్‌లో చేర్పించింది. కొంత కాలం తరువాత యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం రావడం..ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డం జరిగాయి.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా మోదడంతో (Man kills woman on suspicion of affair) తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. యశోద బావకి ఫోన్ చేసిన నీ మరదల్ని చంపేశా..వెళ్లి చూసుకో (brutally murdered) అంటూ ఫోన్ చేశాడు.
దీంతో యశోద అక్క దంపతులు హుటాహుటిన అశోక్‌నగర్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.