Lucknow, Jan 10: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఓ తండ్రిని కుటుంబం దారుణంగా హత్య చేసింది. కూతురుతో కలిసి కుటుంబసభ్యులే అతడిపై పెట్రోల్ పోసి (MAN SET ABLAZE) నిప్పంటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బోదాన్ జిల్లా వాజిర్‌గంజ్ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్‌కు (Mohammad Aamir) ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయం అమిర్‌కు తెలియటంతో ఈ నెల 5వ తేదీన కూతుర్ని నిలదీశాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు అమిర్‌కు మధ్య గొడవ చోటుచేసుకుంది.
దీంతో ఆగ్రహానికి గురైన వారు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 30 శాతం కాలిన గాయాలతో ఇంట్లోనే స్పృహ తప్పిపడిపోయాడు పొరుగింటివారు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అమిర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి వాగ్మూలం మేరకు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసుకున్నారు.
శుక్రవారం చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు పరారీలో ఉండటంతో దగ్గరి బంధువులు, పొరిగింటివారు, పోలీసులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యులపై పోలీసులు సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.