Ramchi, Jan 10: ఢిల్లీలో నిర్భయ ఘటనలో దోషులను ఉరి తీసిన తరువాత కూడా కామాంధులలో మార్పు రావడం లేదు. అదే తరహాలో కామాంధులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ బధువా ఘటన మరచిపోకముందే జార్ఖండ్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిర్భయ ఘటన, ఉత్తరప్రదేశ్‌లో బధువా ఘటనను తలపించేలా జార్ఖండ్ లో (Jharkhand Shocker) 50 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. కామాంధులు సాగించిన ఈ కీచక ఘటన (3 men gangraped widow) అత్యంత భయానకాన్ని తలపిస్తోంది.
జార్ఖండ్ రాష్ట్రం చత్రాలోని హంటర్‌గంజ్ ప్రాంతంలో గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమె ప్రైవేట్ భాగాలలో స్టీల్ టంబ్లర్‌ను చొప్పించి మరీ మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా (brutally injure her private parts) హింసించారు. అంతేనా ఈ విషయాన్ని బయటకు చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని, చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.
అయితే బయటకు వెళ్లిన బాధితురాలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో, వెతకడానికి బయలుదేరిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గుర్తించారు. వెంటనే ఆమెను హంటర్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి బీహార్‌లోని గయాలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో చికిత్స తీసుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు అక్కడ ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేద్ ప్రకాష్ మాట్లాడుతూ మహిళ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్య సహాయం కోసం ఆమెను గయాకు పంపించామని చెప్పారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సత్వరమే విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ రిషబ్ ఝా తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారిలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు
ఉత్తర ప్రదేశ్ బధువాలొ ఇలాంటి భయానక స్వభావం ఉన్న మరో కేసు గత వారం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. 50 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒక పూజారి మరియు మరో ఇద్దరు ఆమెను దారుణంగా హత్య చేశారు.
బాధితురాలు, అంగన్‌వాడీ కార్మికురాలు ఆదివారం సాయంత్రం 6 గంటలకు తన గ్రామంలోని ఆలయానికి బయలుదేరింది. ఆమె రెండు-మూడు గంటలు తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాగా రాత్రి 11:30 గంటలకు, ముగ్గురు వ్యక్తులు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంటి బయట పడవేసి పారిపోయారు. బాధితురాలి కుటుంబం ప్రకారం, ముగ్గురు ఆలయ పూజారి బాబా సత్యనారాయణ్, అతని శిష్యుడు వేద్రామ్ మరియు డ్రైవర్ జస్పాల్ గా గుర్తించారు.