Visa Free Travel: మలేషియా టూర్ కు వెళ్లాలనుకునేవారికి బంపర్ ఆఫర్, భారతీయులకు వీసా ఫ్రీ ట్రావెల్ ప్రకటన
దక్షిణ భారతదేశం నుంచి మలేసియాకు విమాన సర్వీసుల్ని యాత్రికులకు డిమాండ్ కు అనుగుణంగా తిరువనంతపురం నుంచి మలేషియాకు (Visa Free Travel) ప్రత్యేక ఛార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
New Delhi, DEC 20: తాజాగా భారతదేశం నుంచి వచ్చే యాత్రికుల కోసం వీసా ఫ్రీ ట్రావెల్ (Visa Free Travel) సౌకర్యాన్ని మలేసియా ప్రకటించింది. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కౌలాలంపూర్ కు లిమిటెడ్ పీరియడ్ తో ప్రత్యేక ప్రమోషనల ఛార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా (Air Asia) ప్రకటించింది. మలేషియా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో భారతీయ పౌరులు వీసా లేకుండా తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది. వీసా ఫ్రీ అనే ఈ సరికొత్త నిబంధన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశం నుంచి మలేసియాకు విమాన సర్వీసుల్ని యాత్రికులకు డిమాండ్ కు అనుగుణంగా తిరువనంతపురం నుంచి మలేషియాకు (Visa Free Travel) ప్రత్యేక ఛార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులతో మొత్తంగా 69 వారపు విమానాలు అవుతాయి. తద్వారా ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచాలనుకుంటున్నట్లు గతంలో ఎయిర్ ఏషియా ప్రకటనతో ఇది అదనం.
డిసెంబర్ 24, 2024 వరకు, గ్లోబ్-ట్రాటర్స్, అడ్వెంచర్ అన్వేషకులు ఎయిర్ ఏషియా విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా దక్షిణ భారతదేశంలోని ఏడు గమ్యస్థానాల నుంచి చాలా ప్రత్యేకమైన ప్రమోషనల్ ధర కోసం విమానాలను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, తిరుచిరాపల్లి, కొచ్చి, హైదరాబాద్, బెంగుళూరు, కోల్‌కతా, త్వరలో త్రివేండ్రం నుంచి కౌలాలంపూర్‌కు కేవలం రూ.4,999తోనే ప్రయాణించవచ్చు. మలేషియా నుంచి, భారతీయ ప్రయాణికులు తమ ఆశల రెక్కలను మరింత విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లోని 130 కంటే ఎక్కువ గమ్యస్థానాల ఎయిర్‌లైన్ యొక్క విస్తృత నెట్‌వర్క్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లై-త్రూ ద్వారా ప్రయాణించవచ్చు.