Amaravati, May 26: దాదాపు రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు (Domestic Flight Operations in AP) పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ముంబై-ఢిల్లీ కనీస టికెట్ ధర రూ. 3500, మినిమం ధర రూ. 10 వేలు, 3నెలల పాటు ఇదే ఛార్జీలు అమల్లో, వివరాలను వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
బెంగళూరు వెళ్లేందుకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బారులు తీరారు. కరోనా నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. మరోవైపు గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రత విభాగాన్ని సబ్ కలెక్టర్ ధ్యాన చందర్ పరిశీలించారు. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి
ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు.
Here's ANI Tweet
Andhra Pradesh: Domestic flight operations resume from today at Visakhpatnam airport, during the fourth phase of COVID19 lockdown pic.twitter.com/NqDMHNWS3r
— ANI (@ANI) May 26, 2020
గన్నవరం (Gannavaram Airport) నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు రెండు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మధుసూదన్‌రావు సూచించారు. 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత
ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఒక విమానం చేరకుంది. మరోవైపు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి విశాఖకు (Visakhpatnam airport) 114 మంది ప్రయాణికులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికులను అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. స్వాబ్ కలెక్షన్ తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. కాగా, దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో సోమవారం నుంచే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తల్లిని చూడాలనే ఆరాటం, విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం, మూడు నెలల తర్వాత తల్లి చెంతకు చేరిన విహాన్ శర్మ
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు నాలుగు దఫాలుగా లాక్ డౌన్‌ను అమలు చేస్తూ వస్తోంది. అదే నెల 25వ తేదీ నుంచి అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను సైతం నిలిపివేసింది. కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.తాజాగా లాక్‌డౌన్ 4.0లో (COVID19 lockdown) కేంద్రం కొన్ని సడలింపులతో ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది.
అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు ప్రారంభం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యంతో పాటు వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్గదర్శకాలతో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులిచ్చింది. దీంతో మంగళవారం నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఏపీలో తొలి దశలో నాలుగు దేశీయ విమానాలకే అనుమతులు లభించింది. మంగళవారం ఉదయం 6.55 గంటలకు బెంగళూరు నుంచి ఇండిగో విమానం, సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంతో పాటు రాత్రి 9 గంటలకు బెంగుళూరు నుంచి ఎయిర్ ఏషియా విమానాలు విశాఖ విమానాశ్రయానికి రానున్నాయి. ఉదయం 11.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం రానుంది. ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతికాంశాలతో పాటు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఈ సర్వీసులను పెంచేందుకు విమానయాన అధికారులు చర్యలు చేపడుతున్నారు.