Visakha, Dec 15: ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. విశాఖ నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్ సర్వీస్‌లను ప్రారంభిస్తున్నట్లు థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ డైరెక్ట్ సర్వీస్‌లు ఉండబోతున్నట్లు పేర్కొంది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో డైరెక్ట్ ఫ్లైట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు లేవు. కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తుండటంతో ఇక్కడి నుంచి ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.