Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోత, ఐదుగురు పౌరులు మృతి, మణిపూర్, మణిపూర్ హింస, మణిపూర్ కాల్పులు
వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్‌పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Imphal, jan 19: మణిపూర్‌లో మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. వేర్వేరు ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులు చనిపోగా.. కాంగ్‌పోక్పి జిల్లాలో ఒకర్ని దుండగులు కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం రాత్రి తౌబల్ జిల్లాలో కాల్పులు జరగడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బందికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు నిద్రిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. అంతకుముందు మంగళవారం అర్ధరాత్రి కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ భద్రతా అధికారి మృతి చెందారు.
గత ఏడాది మే నెల నుంచి మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ ప్రారంభం అయింది. మెయితీ, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి దాడుల్లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.