Odisha Train Tragedy Update: పట్టాలపై అంతులేని విషాదం.. ఒడిశా రైలు ప్రమాదంలో ఢీకొన్నవి రెండు రైళ్లు కాదు.. మూడు రైళ్లు.. 233కు చేరిన మృతుల సంఖ్య.. మరో 900 మందికి పైగా గాయాలు.. ఇంకా బోగీల్లోనే 600-700 మంది!

మాటలకు అందని ఘోరం సంభవించింది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.

Coromandel Express Accident (Photo Credit: ANI)

Bhubaneswar, June 3: ఒడిశాలో (Odisha) ఊహించని మహా విషాదం చోటుచేసుకుంది. మాటలకు అందని ఘోరం సంభవించింది. బాలేశ్వర్‌ జిల్లాలో (Baleshwar District) శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (Train Accident) మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు.

Coromandel Express Derailment Video:గూడ్స్‌ను ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌, 50 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు

రెండు కాదు మూడు రైళ్లు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ప్రమాద ఘటనలో రెండు కాదు మూడు రైళ్లు ఢీకొన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన క్రమాన్ని ఈ విధంగా వివరించారు.. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. దీంతో మృతుల సంఖ్య 233కు చేరింది. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇంకా బోగీల్లోనే 600-700 మంది ఉన్నట్టు సమాచారం.

Sharwanand and Rakshita Reddy Marriage: హీరో శర్వానంద్‌-రక్షితా రెడ్డి పెళ్లి వేడుక షురూ, హల్దీ కార్యక్రమం వీడియో వైరల్‌