Wedding Loans: ఇంటి ఋణం, కారు రుణం గురించే విన్నాం.. ఇది వివాహం రుణం.. మ్యాట్రిమొనీ.కామ్‌ సంస్థ సరికొత్త సేవలు

వివాహం కోసం రుణం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్‌, సంగీత్‌, హల్దీ, మ్యారేజ్‌, రిసెప్షన్‌ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Marriage (Credits: Pixabay)

Newdelhi, Nov 16: ఇంటి రుణం (House Loan), కారు రుణం (Car Loan) గురించే విన్నాం.. వివాహం కోసం రుణం (Wedding Loans) గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్‌, సంగీత్‌, హల్దీ, మ్యారేజ్‌, రిసెప్షన్‌ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. పెండ్లి చేసుకోవడం ఈ రోజుల్లో పెద్ద ఖర్చు. ఈ నేపథ్యంలో మ్యాట్రిమొనీ.కామ్‌ సంస్థ సరికొత్త సేవలు ప్రారంభించింది. ఇంతకాలం పెండ్లి సంబంధాలు కుదుర్చుతున్న ఈ సంస్థ ఇక మీదట పెండ్లి ఖర్చుల కోసం రుణాలు ఇప్పించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వెడ్డింగ్‌లోన్స్‌.కామ్‌’ అనే ఫిన్‌ టెక్‌ వేదికను ప్రారంభించింది.

ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

వీటితో జట్టు

ఐడీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ వంటి సంస్థలతో జట్టుకట్టామని, వీటి నుంచి వివాహాల కోసం రుణాలు ఇప్పిస్తామని మ్యాట్రిమొనీ.కామ్‌ సంస్థ సీఈవో మురుగవేల్‌ జానకిరామ్‌ తెలిపారు. ఈ రుణాల కోసం పెండ్లికాని ప్రసాద్ లు ఎంతమంది క్యూకడుతారో చూడాలి ఇక.

వీడియో ఇదిగో, ఫోన్ చూసుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న మహిళను ఢీకొట్టిన కారు, తర్వాత ఏమైందంటే..



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif