Mia Khalifa: రైతులు పెయిడ్ యాక్టర్లలా కనిపిస్తున్నారా..ఆగ్రహం వ్యక్తం చేసిన మియా ఖలీపా, రైతులకే నా మద్ధతు అని స్పష్టం, రైతుల ఉద్యమంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం
మీరు అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’’ అని స్పష్టం చేశారు.
New Delhi, Feb 6: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధానిలో ఉద్యమం (Farmers Protest) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంపై అమెరికన్ పాప్ సింగర్ రిహాన్నా, యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫాలు మంగళవారం ట్విటర్ ద్వారా తమ మద్ధతు తెలిపారు. రెండు రోజుల క్రితం మియా ఖలీపా ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ మానవ హక్కులకు భంగం కలిగేంతగా ఏం జరుగుతోందని న్యూఢిల్లీలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపేశారు’’ అని పేర్కొన్నారు.
అనంతరం మరో ట్వీట్‌లో.. రైతులను పేయిడ్ యాక్టర్లు అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తన మద్దతు (Still Standing With the Farmers) తెలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై కొంతమంది వ్యక్తులు మండిపడ్డారు.‘‘మియా ఖలీఫా (Mia Khalifa) స్ప్రహలోకి రా!’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులపై కూడా ఆమె స్పందించారు. శుక్రవారం ట్విటర్‌లో ‘‘ నేను స్ప్రహలోనే ఉన్నానని ధ్రువీకరిస్తున్నాను. మీరు అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’’ అని స్పష్టం చేశారు.
Here's Updates:
ఇదిలా ఉంటే దేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్ఆర్) స్పందించింది. ఉద్యమకారులు, అధికార యంత్రాంగం సంయమనం పాటించాలని సూచించింది. అన్ని వర్గాల మానవ హక్కులను కాపాడుతూ, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఓ ట్వీట్‌లో ఆకాంక్షించింది.
మరోవైపు, రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ప్రముఖ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్, పాప్ సింగర్ రిహన్నా తదితరులపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ సహా పలువురు విరుచుకుపడ్డారు. గ్రెటాపై ఢిల్లీలో కేసు కూడా నమోదైంది. కాగా, రైతులు తమ హక్కుల సాధనలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రాస్తారోకో నిర్వహించనున్నారు.