Go First Negligence: 50 మంది ప్రయాణికులను వదిలేసి గాల్లోకి లేచిన విమానం, నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించిన డీజీసీఏ, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపిన గో ఫస్ట్ ఎయిర్

విమానాశ్రయంలో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను (After 50 Plane Passengers) ఎక్కించుకోకుండానే టేకాఫ్ అయిన ఘటనపై డీజీసీఏ విచారణకు (Regulator Demands Explanation) ఆదేశించింది. ఈ నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

maged used for representational purpose only | (Photo Credits: GoAir

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ప్రయాణికులు బస్సులోనే వేచి ఉండగా టేకాఫ్ (Go First Flight Mistake) అయిన సంగతి విదితమే. గో ఫస్ట్ ఎయిర్ వేస్ విమానం... విమానాశ్రయంలో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులను (After 50 Plane Passengers) ఎక్కించుకోకుండానే టేకాఫ్ అయిన ఘటనపై డీజీసీఏ విచారణకు (Regulator Demands Explanation) ఆదేశించింది. ఈ నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

తమను వదిలేసి పోవడంపై బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా సదరు ఎయిర్ లైన్స్ సంస్థపై విరుచుకుపడ్డారు. ఒక భయంకరమైన అనుభవం అని విమర్శించారు.నిన్న ఉదయం 6.30 గంటల సమయంలో బెంగళూరులోని కెంపేగౌడ ఇటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన సంభవించింది. విమానంలోకి ఎక్కాల్సిన ప్రయాణికులను నాలుగు బస్సులలో రన్ వే వద్దకు తీసుకెళ్లారు. అయితే, ఒక బస్సులోని ప్రయాణికులను మాత్రం కిందకు దించలేదు. వారు బస్సులో వేచి చూస్తున్న సమయంలోనే విమానం టేకాఫ్ అయింది.

ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టస్‌పై దారుణం, తప్పతాగిన మందుబాబులు మహిళా సిబ్బందిపై వికృతచేష్టలు, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి

దీంతో ఫ్లైట్ మిస్ అయిన ప్రయాణికులు ఈ విషయాన్ని సదరు ఎయిర్ లైన్ సంస్థ, ప్రధాని మోదీ, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. మరోవైపు ఫ్లైట్ మిస్ అయిన ప్రయాణికుల లగేజీ మొత్తం చెకిన్ కావడం గమనార్హం. అయితే, జరిగిన పొరపాటును గమనించిన ఎయిర్ లైన్స్ అధికారులు నాలుగు గంటల తర్వాత వారికి మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఎయిర్ లైన్స్ పై డీజీసీఏ సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.

విమానంలో దారుణం, ఫ్యాంట్ జిప్పి విప్పి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖ రాసిన బాధితురాలు

విమానం గాల్లోకి ఎగిరే విషయం గ్రౌండ్‌ సిబ్బందికి కూడా తెలియదంట. విమానం ఎక్కకుండానే తిరిగి ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ప్రయాణికుల బోర్డింగ్‌ పాస్‌లు చూసి విమానాశ్రయం అధికారులు అవాక్కయ్యారు. విమానం మిస్సయిన ప్రయాణికుల బ్యాగేజీని వెనక్కి తెప్పించిన అధికారులు.. తిరిగి 10 గంటలకు 54 మందిని మరో విమానంలో ఢిల్లీకి పంపించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న డీజీసీఏ.. నివేదిక అందజేయాలని ఎయిర్‌పోర్ట్‌ అధికారులను ఆదేశించింది. నివేదిక ఆధారంగా కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు గోఫస్ట్‌ అధికారులు నిరాకరించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ట్వీట్‌ ద్వారా సంస్థ తెలిపింది.