Mumbai Rains: ముంబై రెండు రోజుల పాటు బంద్, దేశ ఆర్థిక రాజధానిని వణికిస్తున్న వర్షాలు, చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు, రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు (Mumbai Rains) తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ముంబైతోపాటు తూర్పు కొంకణ్, థానే జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
Mumbai, August 4: ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు (Mumbai Rains) తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ముంబైతోపాటు తూర్పు కొంకణ్, థానే జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సిద్ధరామయ్యకు కరోనా, స్వీయ నిర్భంధంలోకి త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్, దేశంలో తాజాగా 52,050 కేసులు నమోదు, 18,55,745కు పెరిగిన కోవిడ్-19 కేసుల సంఖ్య
దీంతో అనేక సేవలకు అంతరాయం కలిగింది. గత 10 గంటల్లో ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముంబై మున్సిపల్‌కార్పొరేషన్ తెలిపింది. ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలతో అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటికి ముంబై ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప రెండు రోజుల పాటు ఎవరు ఇళ్లు దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.
Severe Waterlogging in Lower Parel & Other Areas of Mumbai:
సోమవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ముంబైలోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్ ఆఫ్ ఇండియా, సమతా నగర్ పోలీస్ స్టేషన్, హైవే ముంబై, ఉత్తర కొంకణ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ (Red Alert) అమల్లో ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) కేఎస్ హోసాలికర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వర్షాల కారణంగా పలు రైళ్లను (Mumbai Local trains) నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే (సీఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు. సముద్రంలో ఆటుపోట్లు, వడాలా వద్ద రైల్వేలైన్‌పై వరద నీరు నిలువడంతో మెయిన్లైన్, నౌకాశ్రయ మార్గంలో సబర్బన్ సేవలను నిలిపివేశారు. పన్వెల్- థానే, కళ్యాణ్-దాటి మధ్య షటిల్ సేవలు నడుస్తున్నాయి. ఆయా స్టేషన్ల మధ్య సబర్బన్ రైళ్లను రద్దు చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను రీ షెడ్యూల్ చేశామని ఆయన పేర్కొన్నారు.