Bengaluru Riots: గుడిని కాపాడేందుకు ముస్లీంలు మానవహారం, బెంగుళూరు అల్లర్లలో వెల్లివిరిసిన మతసామరస్యం, సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా (human chain) నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు (Muslims form human chain to save temple) భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. భారతీయతలోని గొప్పదనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Muslim youth forming a human chain around a temple in Bengaluru (Photo Credits: Screengrab/ANI)

Bengaluru, August 12: ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటక రాజధాని బెంగ‌ళూరులో పెను విధ్వంసం (Bengaluru Riots) సృష్టించింది. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస‌మూర్తి బంధువు కావ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యే ఇంటిపై మంగ‌ళ‌వారం రాత్రి ఓ వర్గం దాడి చేశారు. ఆయ‌న ఇంటిని ధ్వంసం చేయ‌డంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ప్రాంతంలోని సుమారు 200-250 కార్ల‌తో పాటు పోలీసు వాహ‌నాల‌కు దుండుగులు నిప్పంటించారు.

దుండ‌గులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జ‌ర‌ప‌డంతో అల్ల‌ర్లు ఇంకా తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌గా, 60 మంది పోలీసు సిబ్బంది గాయ‌ప‌డ్డారు. దీంతో డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో (DJ Halli Police Station) ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. కాగా బెంగ‌ళూరులో 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది.

Update by ANI

ఈ అల్లర్లలో భారత దేశంలో కొనసాగే మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన జరిగింది. ముస్లిం యువకులు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ మతసామరస్యాన్ని చాటారు. ఆందోళనకారులు అక్కడి హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా (human chain) నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు (Muslims form human chain to save temple) భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. భారతీయతలోని గొప్పదనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌తో బెంగుళూరులో అల్లర్లు, ఇద్దరు మృతి, 60 మంది పోలీసులకు గాయాలు, సీఎం యడ్యూరప్ప సీరియస్, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన హోమంత్రి

దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్‌ కూడా స్పందిస్తూ ఆ ముస్లిం యువకులను ప్రశంసించారు. ఒక కమ్యూనిటీలోని కొందరు చేసిన పని కారణంగా ఆ మొత్తం కమ్యూనిటీని నిందించడం సరికాదని అన్నారు. బెంగళూరు ఘర్షణలకు కారణమైన వారిని అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. హిందూముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి ఉండాల‌ని సందేశాన్నిచ్చార‌ని నెటిజ‌న్లు వారిని కొనియాడుతున్నారు. కాగా బెంగ‌ళూరు అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 110 మందిని అరెస్టు చేయ‌గా, వివాదాస్ప‌ద పోస్టు చేసి ఘర్ష‌ణ‌కు కార‌ణ‌మైన న‌వీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.