Nara Lokesh on DSC: ఏపీలో త్వరలో 595 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ వేదికగా నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు, 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని వెల్లడి

1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.

Nara Lokesh (Photo-Video Grab)

Vjy, Nov 13: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించారు.ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు.

"గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తాము, అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఎంటిఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఉండవు. వారికి రిటైర్ మెంట్ వయసు 60సంవత్సరాలు. సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ చెప్పారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

ప్రజాదర్బార్ లో డిఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు నన్ను కలిశారు. 1998 డిఎస్సీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న 4,534 పోస్టుల్లో 3939 పోస్టులు భర్తీచేశారు, ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది, ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారు, పరిశీలించి న్యాయం చేస్తామని నారా లోకేష్ చెప్పారు.

గతంలో టిడిపి ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యను బాధ్యతగానే చేపట్టింది, గతంలో టిడిపి ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నపుడు 11 డిఎస్సీలు నిర్వహించి 1.5లక్షల టీచర్ పోస్టులు భర్తీచేశాం, అందులో 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెట్టారు.

అభ్యర్థుల విన్నపాల మేర తొలుత టెట్ నిర్వహించాం. త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. వైసిపి ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీచేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి ప్రజలు 93శాతం సీట్లు ఇచ్చారు. నిరుద్యోగులంతా మనవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించారని తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif