Pulse Polio: దేశవ్యాప్తంగా పల్స్ పోలియా డ్రైవ్, ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కలు తప్పనిసరి, మూడు రోజులు రోజల పాటూ కొనసాగనున్న కార్యక్రమం, తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ(Mansuk Mandaviya) పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు.

Polio drop (Photo Credits: Flickr, CDC)

Hyderabad, Feb 27: దేశవ్యాప్తంగా పల్స్ పోలియో(pulse polio) కార్యక్రమం కొనసాగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ(Mansuk Mandaviya) పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు (pulse polio)వేయించాల‌ని త‌ల్లిదండ్రుల‌కు మాండ‌వీయ విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాయి.తెలంగాణ (Telanagana) వ్యాప్తంగా 38 లక్షల 31 వేల 907 మంది ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఉండగా, 23 వేల 331 పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Gold Price: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్, బంగారం ధరలకు రెక్కలు, ఏకంగా గ్రాముకు రూ. 850 పెరిగిన బంగారం

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో 869 ట్రాన్సిట్‌ కేంద్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. అన్ని జిల్లాలకు కలిపి మొత్తం 50.14 లక్షల పల్స్‌ పోలియో (pulse polio) డోసులు పంపారు. సంచార జాతులు, బిక్షాటన చేసేవారు, ఇటుకబట్టీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మురికివాడలు, ఆదివాసీ పిల్లలపై సిబ్బంది ఈ సారి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Russia-Ukraine War: సాయం అందించండి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

2 వేల 337 మంది సూపర్‌వైజర్లు, 869 సంచార బృందాలను ఏర్పాటు చేశారు. ఇక 8 వేల 589 మంది A.N.Mలు, 27 వేల 40 మంది ఆశాకార్యకర్తలు, 35 వేల 353 మంది అంగన్వాడీలు పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోలియో చుక్కలు వేసుకోని చిన్నారులను ప్రత్యేక బృందాల సాయంతో గుర్తించి.. ఇంటింటికి తిరిగి ఆయా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి