National Voters' Day 2021: జాతీయ ఓటర్ల దినోత్సవం, నేటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి

దేశంలో ఎన్నికల కమిషన్ (Election Commission of India- ECI)ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు.

Voting | Represtional Image | (Photo Credits: PTI)

New Dlehi, Jan 25: భారత్‌లో జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల కమిషన్ (Election Commission of India- ECI)ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు. కాగా భారత ఎన్నికల సంఘం 1950లోనే ఏర్పడినప్పటికీ.. 2011 నుంచే ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి.

ఎన్నికల సంఘంలోని సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సంవత్సరం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేలా చూడాలనేది నేషనల్ ఓటర్స్ డే లక్ష్యం. ఇందుకు ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారిపేరుతో ఓటు నమోదు (Voting Rights in Modern Times) చేయాలి. జనవరి 25న కొత్త ఓటర్లకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డును అందజేస్తారు.

జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఆవిష్కరించనున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఐదుగురు కొత్త ఓటర్లకు ఈ ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీలను అందించనున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సులభంగా డౌన్​లోడ్ చేసుకునే విధంగా ఈ-ఓటర్ కార్డు రూపొందించారు. పీడీఎఫ్ రూపంలో ఈ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. డిజిటల్ లాకర్​లలోనూ భద్రపరుచుకోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

తేలిపోనున్న ఏపీ ‘పంచాయితీ’, సుప్రీంకోర్టులో నేడు విచారణకు ఏపీ పంచాయితీ ఎన్నికల పిటిషన్, ఎస్ఈ కార్యాలయానికి చేరుకున్న నిమ్మగడ్డ, ఎస్ఈసీ తీరుపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

2021 సమ్మర్‌ రివిజన్‌లో కొత్తగా నమోదైన ఓటర్లు ముందుగా తమ ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశవం కల్పించారు. ఈ మేరకు యువ ఓటర్లు జాతీయ ఓటర్‌ దినోత్సవమైన 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ నుంచి ఓటరు ఐడెంటిటీ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు...

ఫారం 6: కొత్తగా ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకునేందుకు దీన్ని భర్తీచేసి సంబంధిత అధికారికి అందజేయాలి.

ఫారం 7: జాబితాలో ఉన్న పేర్లలో అభ్యంతరాలను తెలిపేందుకు వినియోగించాలి.

ఫారం 8: ఓటరు గుర్తింపు కార్డులో చిరునామా, పేరు, ఫొటో మార్పు లాంటి వాటికి.

ఫారం 8ఏ: ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటరు కార్డును మార్చుకునేందుకు

ఆన్‌లైన్‌లో ఓటు నమోదుకు..

ఓటుహక్కును ఆన్‌లైన్‌లోనూ పొందేందుకు వీలుగా https://voterportal.eci.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.