Karnataka: ఈ పాపం ఎవరిది, ఆస్పత్రిలో పసికందును పీక్కు తిన్న కుక్కలు, చికిత్స పొందుతూ చిన్నారి మృతి, తల్లిదండ్రులెవరో ఇక్కడ పడేసి వెళ్లారని చెబుతున్న వైద్యులు
ఈ దాడిలో తీవ్రంగా గామపడిన ఆ పసికందు మరణించింది.
Bengaluru, Sep 8: కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువును కుక్కలు (Newborn Baby Girl Partially Eaten By Stray Dogs) తినేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గామపడిన ఆ పసికందు మరణించింది. మాండ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంఐఎంఎస్) సమీపంలో (arnataka Hospital Premises) పసి పాపను కుక్కలు పాక్షికంగా పీక్కు తిన్నాయి. బేబీ శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ దారుణాన్ని గమనించిన అక్కడి వారు ధైర్యం చేసి ఆ కుక్కల బారి నుంచి పసి పాపను కాపాడారు. అయితే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ నవజాత శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది.
అయితే ఒక రోజు కిందట వైకల్యంతో పుట్టిన ఆ పసి పాపను తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద వదిలేశారని వైద్యులు ఆరోపించారు. ఆ శిశువు తమ ఆసుపత్రిలో జన్మించలేదని చెప్పారు. సెప్టెంబర్ 1-5 మధ్య పుట్టిన వారిలో నలుగురు శిశువులు చనిపోయినట్లు వివరించారు.
ఇందులో ముగ్గురు బాబులు, ఒక పాప ఉన్నట్లు వెల్లడించారు. చనిపోయిన పసిపాపకు అంత్యక్రియలు నిర్వహించినట్లు తల్లిదండ్రులు చెప్పారన్నారు. దీంతో కుక్కలు దాడి చేసిన శిశువును ఎవరో ఆసుపత్రి వద్ద వదిలేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.ఆసుపత్రి వర్గాలు, పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కుక్కల దాడితో శిశువు చనిపోయిన సంఘటనపై మాండ్య నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.