Hyderabad Encounter: హైదరాబాద్ పోలీసులకు నోటీసులు, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియజేయాలని డీజీని ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ
వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు.
Hyderabad, December 6: హైదరాబాద్ (Hyderabad) శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిషా(Disha)పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ (Telangana encounter) చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.దిషా హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం(The National Human Rights Commission) స్పందించింది.
మీడియా(Media)లో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటో(suo moto)గా స్వీకరించింది. ఎన్‌కౌంటర్(Encounter)పై అత్యవసర దర్యాప్తుకు ఎన్‌హెచ్‌ఆర్సీ (NHRC) ఆదేశించింది. ఎన్‌కౌంటర్ ఘటనను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి నిజనిర్ధారణ టీమ్‌ను పంపాలని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్ కావడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, దిషాపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. ‘సాహో సజ్జనార్... శభాష్ సజ్జనార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.