Cyberabad Police Commissioner VC Sajjanar | Four accused (Photo Credits: IANS)

Mumabi,December 6: తెలంగాణా రాష్ట్రంలోని శంషాబాద్ అత్యాచార ఘటన(hyderabad doctor murder)పై గత వారం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు దిషా హత్యాచారం కేసు(Justice for Disha)లో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం (Hyderabad Encounter) పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయస్థాయి నేతలు దీనిపై స్పందిస్తున్నారు. వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దిషా ఘటన అత్యంత దారుణ ఘటనగా అభివర్ణిస్తున్నారు. ఎవరేమన్నో ఓ సారి చూద్దాం.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal )

ఎన్ కౌంటర్ జరగడం ఆందోళన చెందాల్సిన విషయమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన విధానమని, న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై అన్ని ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Delhi CM Arvind Kejriwal 

దిషా..ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం జరిగిన ఎన్ కౌంటర్‌పై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

బీజేపీ ఎంపీ మేనకా గాంధీ (BJP MP Maneka Gandhi)

జరిగింది అత్యంత దారుణ ఘటనగా బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అభివర్ణించారు. అయితే లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తప్పుపట్టారు. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోలేరని వ్యాఖ్యానించారు. చట్టానికి అనుగుణంగా విచారణ ప్రక్రియకు ముందే పోలీసులు నిందితులను మట్టుబెడితే ఇక కోర్టులు, చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌ (Chhattisgarh Chief Minister Bhupesh Baghel )

నేరస్తుడు పారిపోతున్న క్రమంలో పోలీసులకు మరో ప్రత్యామ్నాయం ఉండదని హైదరాబాద్‌ పోలీసుల చర్యను చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌ సమర్ధించారు.ఈ ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరిగినట్టేనని అన్నారు.

Chhattisgarh Chief Minister Bhupesh Baghel

ఆర్జేడీ నేత రబ్రీ దేవి (Rabri Devi,RJD)

పోలీసుల చర్యను స్వాగతిస్తామని ఆర్జేడీ నేత రబ్రీ దేవి పేర్కొన్నారు. బీహార్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

బాబా రాందేవ్‌ (Baba Ramdev)

దిషా లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ సాహసోపేతమైందని బాబా రాందేవ్‌ స్వాగతించారు. ఎన్‌కౌంటర్‌పై తలెత్తే న్యాయపరమైన ప్రశ్నలు వేరని, ఈ ఘటనతో మాత్రం దేశ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారని వ్యాఖ్యానించారు.

బీఎస్పీ చీఫ్ మాయావతి

యూపీలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పడుకుందని విమర్శించారు బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. నిందితులకు ఇలాంటి కఠిన చర్యలే సరైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలిసే వరకు ఖండించకూడదని శశిథరూర్ తెలిపారు.

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ (Samajwadi Party MP Jaya Bachchan)

బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అయా అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ అన్నారు.

బీజేపీ నేత కపిల్ మిశ్రా

థాంక్యూ హైదరాబాద్ పోలీస్. రేపిస్టులను డీల్ చేసే పద్ధతి ఇదే. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మీ నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నా అని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు.

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.దేశంలో మహిళలపై హత్యాచార ఘటనలకు పాల్పడిన వారిని ఈవిధంగానే శిక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులను చాలామంది తిట్టారని అందులో తానూ ఒకడిని అని..నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు పోలీసులకు హ్యాట్సాఫ్ అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం

దిషా హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అని కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం అన్నారు . రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది ప్రజాస్వామ్యానికి కళంకం అని, సత్వర న్యాయానికి మార్గం కాదని ట్వీట్ చేశారు.

తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్

దిషా నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు.

నటి పూనమ్ కౌర్ 

దిషా నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు నటి పూనమ్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు. దిషా నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిషా ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.