No-Confidence Motion Against Jagdeep Dhankhar: రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు
రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.
New Delhi, Dec 10: పార్లమెంటులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ మొత్తం 71 మంది ఎంపీల సంతకాలతో నోటీసు ఇచ్చినట్టు కూటమి వర్గాలు తెలిపాయి.
ఇక పార్లమెంటులో విపక్షాల నిరసనలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) అసహనం వ్యక్తంచేశారు. ‘మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజల ఆశలు, ఆకాంక్షలను మనం నెరవేర్చాలి. మనమందరం సభా గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు బాగుండటం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు ? ఉచిత రేషన్ ఇవ్వడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
అయితే సాంకేతికంగా ప్రస్తుత సమావేశాల్లో ఈ తీర్మానానికి ఆమోదం లభించే అవకాశం లేదు. ఎందుకంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలు మరో 8 రోజుల్లోనే ముగియనుండడంతో ఆమోదం పొందేందుకే అవకాశం లేదు. ఆందోళనలు చేపడుతూ సభకు అంతరాయాలు కలిగిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీల వైఖరిని జగ్‌దీప్ ధన్‌ఖడ్ తప్పుబడుతూ వస్తున్నారు. పద్దతి మార్చుకోవాలంటూ మందలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష పార్టీల ఎంపీలు నిర్ణయించారు.
కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు సంతకాలు చేసినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నిజానికి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు... అదానీ వ్యవహారంలో కాంగ్రెస్, ఇతర ఎంపీలతో పాటు పాల్గొనలేదు. పార్లమెంటు ఆవరణలో చేపట్టిన నిరసనల్లో పాల్గొనడం లేదు. అయినప్పటికీ రాజ్యసభ సభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసుల విషయంలో కలిసి రావడం గమనార్హం.