Supreme Court Criminal cases should not be slapped against journalistX)

New Delhi, Dec 10: ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. ఇది విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలి ఉన్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవశ్యతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. కొవిడ్‌ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్‌ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఉచితాల కోసం మిగిలినట్టున్నారు అంటూ కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటిలను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2020లో కొవిడ్‌ కాలంలో మొదలైన వలస కార్మికుల కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ శ్రమ్‌ పోర్టల్‌లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్‌ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి? ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, నైపుణ్యాభివృద్ధిని పెంపొందిచడానికి మనం ఎందుకు పని చేయకూడదు? అని ప్రశ్నించింది.