Noida Twin Towers Demolition: కూల్చారు సరే, ఆ వ్యర్థాలు తీయాలంటే 3 నెలల సమయం, 9 సెకండ్లలోనే కుప్పకూలిన ట్విన్ టవర్స్, అపెక్స్‌,సెయానే టవర్స్ గురించి ఆసక్తికర విషయాలు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన జంట భవనాలు (Noida Twin Towers Demolition) నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది.

Noida Twin Towers Demolition (Photo-ANI)

Noida, August 28: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన జంట భవనాలు (Noida Twin Towers Demolition) నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది.

ఒక్క బటన్‌ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు (Apex, Ceyane Towers ) కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను (Crashing Down After Use of 3,700 kg Explosives) అమర్చారు.

ఇందుకోసం పిల్లర్స్‌కు సుమారు 7వేల రంద్రాలు చేశారు. వాటర్‌ ఫాల్‌ టెక్నిక్‌తో ఒక్క బటన్‌ నొక్కగానే సెకన్ల వ్యవధిలో కూల్చేందుకు 20వేల సర్క్యూట్‌ను సిద్ధం చేశారు.100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్‌ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది.

అయితే ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు.ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది.

Here's Noida Twin Towers Demolition Video

రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1,200 కోట్లు.ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు.దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వ‌చ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్ప‌టివ‌ర‌కు ప‌రిస‌రాల్లోని 35 వీధి కుక్క‌ల‌నుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

3.. 2.. 1.. 0.. భూం... 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..

సుప్రీం కోర్ట్‌ ఆదేశాలతో ఆగస్ట్ 8 నుంచి సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, నోయిడా అధికారులు ఆధ్వర్యంలో ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థతో కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. జంట భవనాల కూల్చి వేత పనుల్ని పూర్తి చేసినట్లు నోయిడా పోలీస్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు. భవనాల్ని నేల మట్టం చేసేందుకు సహాయక చర్యల కోసం 560మంది పోలీసులు, 100 రిజర్వ్‌ పోర్స్‌ సిబ్బంది, 4 క్విక్‌ రెస్పాన్స్‌ టీంలు రంగంలో​కి దిగినట్లు చెప్పారు.

కూలే సమయంలో కొన్ని సెకన్ల పాటు 30 మీటర్ల రేడియస్‌ వరకు కంపించింది. ఈ ప్రకంపనల పరిమాణం సెకనుకు దాదాపు 30మిల్లీ మీటర్లు వరకు వెళ్లాయి. రిక్టర్ స్కేలుపై 0.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఎలా కంపిస్తుందో.. కూల్చి వేత సమయంలో నోయిడా టవర్స్‌ అలా కంపించాయి. ఈ టవర్స్ 6 వరకు భూకంపాలను తట్టుకునేలా నిర్మించబడిందని అధికారులు తెలిపారు.

కూల్చివేతకు ముందుగా ట్విన్‌ టవర్స్‌ చుట్టు పక్కల సుమారు 7వేల కుటుంబాల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తెలిపారు. తిరిగి వాళ్లు సాయంత్రం 5.30గంటలకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కూల్చి వేతతో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్థానిక నివాసాల్లో గ్యాస్‌, పవర్‌ సప్లయ్‌ నిలిపివేశారు. సాయంత్రం 4 గంటలకు కరెంట్‌, గ్యాస్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది.సెక్టాకర్‌ 93ఏలో ట్విన్‌ టవర్స్‌ను నిర్మించిన ప్రాంతం చుట్టూ 450 మీటర్ల వరకు వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు.

రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగింది . ఈ బీమా ట్విన్‌ టవర్స్‌ పక్కనే ఉన్న భవనాలకు ప్రమాదం జరిగితే..నష్ట పరిహారంగా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రీమియం, ఇతర ఖర్చులను సూపర్‌టెక్ సంస్థ భరించాలి.కూల్చివేతతో టవర్స్‌ నిర‍్మాణం కోసం ఉపయోగించిన ఉత్త ఇనుము వల్లే సుమారు రూ.50కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

ఒక్కో టవర్‌లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్‌గా విరిగిపోయాయి. టవర్లలో ఒకటైన అపెక్స్‌లో 32 అంతస్తులను కలిగి ఉంది. సెయానేలో 97ప్లాట్లు ఉన్నాయి. మరొకటి 29. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900కు పైగానే ఫ్లాట్‌లు ఉన్నాయి, వీటిలో మూడింట రెండు వంతులు బుక్ చేయబడ్డాయి. మరికొన్నింటిని అమ్మేశారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్‌ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.

9 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత జంట టవర్లను కూల్చివేశారు. సవరించిన బిల్డింగ్ ప్లాన్‌లో భాగంగా ఈ టవర్‌లు నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదంపై సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్ సొసైటీకి చెందిన నలుగురు స్థానికులు యూఎస్‌బీ తోతియా(80), ఎస్‌కే శర్మ(74), రవి బజాజ్‌ (65), ఎంకే జైన్‌ (59) నివాసితులు 2012లో కోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఉద్యానవనం ఉన్న స్థలంలో టవర్లను నిర్మించినట్లు వారు తెలిపారు. అనుమతుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014లో అలహాబాద్ హైకోర్టు కూల్చివేతకు ఆదేశించగా..ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. గత ఆగస్టులో, కోర్టు టవర్లను కూల్చివేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది, కానీ సాంకేతిక సమస్యల కారణంగా అది ఒక సంవత్సరం పట్టింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now