Odisha: ఒడిశాలో ఒకే ట్రాక్‌పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు, లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో తప్పిన ఘోర ప్రమాదం, అసలేం జరిగిందంటే..

ఒడిషాలోని సుందర్‌ఘర్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మూడు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈరోజు ఘోర రైలు ప్రమాదం తప్పింది.

Railways Resume Passenger Trains Services in Balasore (Photo Credit: ANI)

Rourkela, Nov 23: ఒడిషాలోని సుందర్‌ఘర్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో సహా మూడు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్‌పై రావడంతో ఈరోజు ఘోర రైలు ప్రమాదం తప్పింది. నివేదికల ప్రకారం, సంబల్‌పూర్-రూర్కెలా మెము రైలు, రూర్కెలా-జార్సుగూడ ప్యాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్‌లో ఎదురెదురుగా వచ్చాయి. ఫైలట్లు అప్రమత్తం వల్ల ఆ రెండూ 100 మీటర్ల దూరంలో ఆగిపోయాయి.

మూడో రైలు పూరీ-రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే ట్రాక్‌పై నడుస్తోంది. పూరీ-రూర్కెలా మధ్య నడిచే సూపర్‌ఫాస్ట్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Puri- Rourkela Vande Bharat) కూడా అదే ట్రాక్‌పై దూసుకురావడాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వందేభారత్‌ లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో అది 200 మీటర్ల దూరంలో ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ నివేదిక ఇదిగో, తప్పుడు సిగ్నల్‌తోనే ఘోరం చోటు చేసుకుందని స్పష్టం

రూర్కెలా రైల్వే స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగాఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చినట్లు అధికార వర్గాలు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

రైలు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందో బయటపెట్టిన రైల్వేశాఖ, ప్రమాదం జరిగిన తీరుపై చార్ట్‌ విడుదల

కాగా ఒడిశాలోని బాలాసోర్‌లో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు రైళ్లు (Three trains) ఒకదానికొకటి ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.