Omicron in India: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది, వచ్చే నాలుగు నెలల వరకు ఇది కొనసాగుతుంది, రోజుకు 1.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్న నిపుణులు

ఒక్కసారిగా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పతాక స్థాయికి (Omicron Driving COVID-19 Cases) చేరాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ (Third Wave in India) మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్ కే ఆరోరా తెలిపారు.

Coronavirus in India (Photo-PTI)

New Delhi, January 3: దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. ఒక్కసారిగా కేసులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పతాక స్థాయికి (Omicron Driving COVID-19 Cases) చేరాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ (Third Wave in India) మొదలైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్ కే ఆరోరా తెలిపారు.

ముంబై, ఢిల్లీ, కోలకతా వంటి నగరాల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వల్లే వ్యాప్తి చెందాయని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో ఒమిక్రాన్ కేసు గుర్తించగా డిసెంబర్ చివరి వారానికి దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్ కేసులేనని వివరించారు. తదుపరి వారానికి ఇది 28 శాతానికి పెరిగిందన్నారు.

ఒమిక్రాన్ వేగవంతమైన వ్యాప్తి కారణంగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు దీనిని నిదర్శనమని ఆయన అన్నారు.ఇక దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో ఐఐటీ కాన్పుర్​కు చెందిన ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ కీలక విషయాలను వెల్లడించారు. భారత్​లో కొవిడ్‌ థర్డ్ ​వేవ్ మొదలయిందని.. అది జనవరి నుంచి ఏప్రిల్ (నాలుగు నెలలు) వరకు ​ఉంటుందని పేర్కొన్నారు.

దేశ రాజధానిలో ఒమిక్రాన్ కల్లోలం, ఒక్కరోజే 4,099 కొత్త కరోనా కేసులు, 84 శాతం శాంపుల్స్‌లో ఒమైక్రాన్ వేరియంట్

రోజుకు 1.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఆసుపత్రుల బారిన పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలు సూపర్​ స్ప్రెడర్లుగా మారతాయని హెచ్చరించారు. భారీ ప్రజా సమూహాల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం అంత సులువు కాదన్నారు.

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వారికి ప్రారంభమైన కరోనా టీకాల పంపిణీ, కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాలు

ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ర్యాలీలు జరిగే అవకాశాలే అధికమని మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. 'ఎన్నికల ర్యాలీల్లో భారీఎత్తున ప్రజలు పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను పాటించరు. దీనివల్ల దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో థర్డ్ వేవ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే ఈసారి కరోనా సోకిన ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుంది.

దేశంలో మళ్లీ కరోనా బీభత్సం, కోల్‌కతాలో 100 మందికి పైగా డాక్టర్లకు పాజిటివ్, నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో 87మంది వైద్యులకు కరోనా

మార్చి చివరి నాటికి దేశంలో రెండు లక్షల పడకలు అవసరమవుతాయి' అని వెల్లడించారు. భారత్‌లోని ప్రజలకు రోగనిరోధకశక్తి అధికంగా ఉందని మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఆఫ్రికా, భారత్​లో 80శాతం జనాభా 45ఏళ్ల లోపువారేనని.. వీళ్లకు సాధారణ రోగనిరోధక శక్తి 80శాతం వరకు ఉంటుందన్నారు.

ముంబైలో కొత్తగా 8,082 కోవిడ్‌ కేసులు, రెండు మరణాలు, గత 24 గంటల్లో 600 మంది డిశ్చార్జ్

మ్యూటెంట్ల కారణంగానే డెల్టా వేరియంట్​ వచ్చిందన్నారు. దక్షిణాఫ్రికా మాదిరే భారత్​లోనూ వేరియంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.