Omicron Spread: కొత్త వేరియంట్ రాకతో దేశంలో థర్డ్ వేవ్‌ గుబులు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఇప్పటివరకు 23 మందికి సోకిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్, ఒమిక్రాన్‌ కేసులు నమోదైన ప్రధాన దేశాలు ఇవే

ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ ( Coronavirus Third Wave) తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు (Omicron Spread) సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Coronavirus in India (Photo-PTI)

New Delhi, Dec 7: దేశంలో కొత్తగా ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ ( Coronavirus Third Wave) తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు (Omicron Spread) సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయిదు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు కనుగొన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, బెంగుళూరులో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం అయిదు రాష్ట్రాల్లో నమోదైన కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కు చేరింది.

మహరాష్ట్రలో రెండు, రాజస్థాన్‌లో ఒక కేసు.. నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 23 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నిన్న కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో అక్కడ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 10కి చేరింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కొత్తగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి(37), అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తికి (36) ఈ వైరస్‌ సోకినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక జైపూర్‌లో తొమ్మిది మందికి ఢిల్లీలో ఒకరికి, బెంగుళూరులో మూడు కేసులు నమోదయ్యాయి.

ఈ కొత్త వేరియంట్ ని నవంబర్ 25న తొలిసారిగా దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. దీన్ని తొలిసారిగా కనుగొన్న తరువాత ఈ వేరియంట్ కి B.1.1.529 అని నామకరణం చేశారు. ఆ తర్వాత దీనికి ఒమిక్రాన్ వేరియంట్ అని పేరు పెట్టింది. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారుతోందని, మ్యూటషన్స్ వేగంగా విస్తరిస్తున్నాయని WHO ఆందోళన వ్యక్తం చేసింది.

బ్రిటన్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్, 160కి పైగా కేసులు నమోదు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, ఎవరొచ్చినా క్వారంటైన్‌లో ఉండాలన్న బ్రిటన్ ప్రధాని

నిపుణుల అంచనాల ప్రకారం.. దేశంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య గరిష్టస్థాయికి చేరవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా 60 రోజుల్లో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉండే ‍ ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీని ప్రభావం స్వల్పంగా ఉండొచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో లాక్‌డౌన్‌ అవసరం లేదని, జనసమూహాల నియంత్రణ ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చని సూచించారు.

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావాన్ని గణిత శాస్త్ర పరంగా అంచనా వేశారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్‌'ను వినియోగించారు. అయితే అదే సమయంలో పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తీసుకునే ముందస్తు చర్యలపైనే కొత్త వేరియంట్ వ్యాప్తి, ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు. బూస్టర్‌ డోస్‌కు కసరత్తు చేస్తోంది. మరోవైపు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ఆదేశించింది. వచ్చే 6 వారాలు అప్రమత్తంగా ఉంటే థర్డ్‌ వేవ్‌ గండం గట్టెక్కవచ్చని వైద్యనిపుణులు చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళన

కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు.

Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు ఈ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత రోగనిరోధక శక్తిని ఇస్తాయా? లేదా తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కేసులు భారీగా పెరిగాయి. గత వారంతో ప్రస్తుతం కేసుల సంఖ్యను పోల్చి చూస్తే 700శాతం పెరిగాయి. గతవారం 2,300 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 16వేలకుపైగా రికార్డవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నిర్ధిష్టంగా తెలియకపోయినా.. 70శాతానికిపైగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే ఉన్నాయి.

ఒమిక్రాన్‌ కేసులు నమోదైన ప్రధాన దేశాలు

గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, సెనెగల్, బోట్స్‌వానా, మెక్సికో, భారత్‌, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్‌లో కొత్త వేరియంట్‌ కేసులు రికార్డయ్యాయి.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి