Britain December 05: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటివరకు 30కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మహమ్మారి…కొన్ని దేశాల్లో విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా (South Africa) తర్వాత బ్రిటన్ (Britain) లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది బ్రిటన్.
బ్రిటన్‌లో ఇప్పటివరకు 160 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నైజీరియా(Nigeria ), దక్షిణాఫ్రికా(South Africa) నుంచి వచ్చినవారిలోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్(Britain)కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్(RTPCR) పరీక్ష తప్పనిసరి చేసింది. నైజీరియా(Nigeria ), నుంచి వచ్చినవారి హోటళ్లకు తరలిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు.
ఒమిక్రాన్(Omicron) వ్యాప్తిని నిలువరించడానికి అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. నైజీరియా(Nigeria ), నుంచి వచ్చినవారు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు.
ఒమిక్రాన్(Omicron) వ్యాప్తిని నిలువరించాడనికి ప్రయాణ నిబంధనలు అవసరమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) అన్నారు. ఒమిక్రాన్(Omicron) పై వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 20న దేశంలో ఒమిక్రాన్(Omicron) పరిస్థితులను మరోసారి పరీక్షిస్తామని చెప్పారు.
బ్రిటన్ ఇప్పటికే నైజీరియా(Nigeria ), సహా ఆఫ్రికా తొమ్మిది దేశాలను రెడ్ లిస్ట్‌లో ఉంచింది. కేవలం బ్రిటన్‌కు సంబంధించిన వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇకపై బ్రిటన్‌కు రావాలనుకునేవారు రెండు రోజులముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు.