Operation Ganga: గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చాం, మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నామని తెలిపిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్

ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నాయి.

S Jaishankar. (Photo Credits: Twitter)

 New Delhi, Mar 2: ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఆరు విమానాలు గత 24 గంటల్లో ఇండియాకు వచ్చాయని... ఇందులో పోలండ్ భూభాగం నుంచి వచ్చిన తొలి విమానం కూడా ఉందని చెప్పారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మన వాళ్లను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారానే అక్కడ చిక్కుకున్న మన వారిని వెనక్కి తీసుకొస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

రష్యాకు అమెరికా వార్నింగ్, ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని వెల్లడి, అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం

దీంతో, ఆ దేశంలో చిక్కుకున్న వారిని సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లొవాక్ రిపబ్లిక్ దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి తీసుకొస్తున్నారు. భారత వాయుసేనకు చెందిన భారీ విమానం సీ-17 ఈ తెల్లవారుజామున రొమేనియాకు తరలివెళ్లింది.

Dr. S. Jaishankar Tweet

మరోవైపు ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ లో భారతీయులెవరూ లేరని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ తెలిపారు. కీవ్ లో ఉన్న మనవాళ్లు అందరూ సురక్షితంగా నగరాన్ని వీడారని చెప్పారు. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 9 వేల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.



సంబంధిత వార్తలు

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు