Vocal for Local: మేడ్ ఇన్ ఇండియా, పారామిలిటరీ క్యాంటిన్లలో ఇకపై స్వదేశీ వస్తువులే వాడాలి, కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం, జూన్ 1 నుంచి అమల్లోకి

సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌.. క్యాంటీన్ల‌లో ఇక నుంచి కేవ‌లం మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అమ్మ‌ాలని హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తెలిపారు.

Paramilitary canteens to sell only Made in India products from June 1 after PM's go local call (Photo-PTI)

New Delhi, May 13: కేంద్ర బ‌ల‌గాల‌కు చెందిన క్యాంటీన్ల‌లో ( Central Armed Police Forces) కేవ‌లం స్వదేశీ వ‌స్తువుల‌ను (Vocal for Local) మాత్ర‌మే అమ్మ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌.. క్యాంటీన్ల‌లో ఇక నుంచి కేవ‌లం మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అమ్మ‌ాలని హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తెలిపారు.   రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

ఈ ఏడాది జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి ఈ నియ‌మాన్ని అమ‌లు చేయ‌నున్నారు. ప‌ది ల‌క్ష‌ల ద‌ళాల‌కు చెందిన సుమారు 50 ల‌క్ష‌ల కుటుంబాలు ఇక స్వదేశీ వ‌స్తువులు కొంటార‌ని మంత్రి పేర్కొన్నారు. దేశం స్వ‌యం స‌మృద్ధి కావాలంటే.. స్వ‌దేశీ బ్రాండ్ల‌ను ఎక్కువ‌గా వాడాల‌ని ప్ర‌ధాని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

'మంగ‌ళ‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ భార‌తీయులంతా స్థానిక ఉత్ప‌త్తుల‌పైన‌ దృష్టి పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నిర్ణ‌యం భార‌త్‌ను రాబోయే రోజుల్లో ప్రపంచ నాయ‌క‌త్వ మార్గంలోకి తీసుకెళుతుంది. సుమారు 10 లక్షల మంది సీఏపీఎఫ్‌ సిబ్బందితోపాటు వారి కుటుంబంలోని 50 లక్షల మంది సభ్యులు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించ‌నున్నారు'. అని తెలిపారు.

Here's Home minister Tweet

కాగా క‌రోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊత‌మిచ్చేందుకు ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi) ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పారామిలిటరీ క్యాంటీన్లు ప్ర‌తి ఏటా రూ .2,800 కోట్ల అమ్మకాలను జ‌రుపుతున్నాయి.  లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

సీఏపీఎఫ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సాశాస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్‌బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎన్‌‌జీ)తోపాటు అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వీరంతా భారతదేశంలో తయారైన వ‌స్తువుల‌ను ప్రజలు ఉపయోగించాలని, ఇతరులు కూడా ఇలాగే చేయాల‌ని హోంమంత్రి కోరారు