Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు, రెండు విడతలుగా సెషన్స్‌, ఆశగా ఎదురుచూస్తున్న ఆ రాష్ట్రాలు

రెండు విడతల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు (Parliament Budget Sessions) తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Sessions) జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Parliament (photo-ANI)

New Delhi, JAN 17: రెండు విడతల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు (Parliament Budget Sessions) తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Sessions) జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, బడ్జెట్‌లో ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని.. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరలో బీహార్ ఎన్నికలు జరగనున్నందున, రెండు మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్  విలాస్) రెండూ రాష్ట్రానికి కీలకమైన ప్రకటనల కోసం ఆశిస్తున్నాయి.

Khel Ratna Awards: ఖేల్ ర‌త్న అవార్డు అందుకున్న మ‌నూభాక‌ర్‌, గుకేశ్‌.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం, వీడియో ఇదిగో 

బడ్జెట్‌‎పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఎదురుచూస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు, రెండు విడతలుగా సెషన్స్‌, ఆశగా ఎదురుచూస్తున్న ఆ రాష్ట్రాలు

Sankashti Chaturthi 2025: సంకష్టహర చతుర్థి నేడు.. ఈ శుభ పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా లేటెస్ట్ లీ అందించే ఫోటో గ్రీటింగ్స్ ను వాట్సాప్, ఎఫ్ బీ ద్వారా తెలియజేయండి.

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Share Now