Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి స్పష్టత.. సమయం గడుస్తున్న కొద్దీ తెలిసి వస్తుందన్న హర్దీప్ సింగ్ పూరి.. ఇంకా ఆయన ఏమన్నారంటే?
దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో తగ్గింపు విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు.
Newdelhi, June 11: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు (Crude Oil Prices) తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు మాత్రం ఆ మేరకు తగ్గలేదు. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. చమురు ధరలను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకువస్తే వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారం తగ్గుతుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో తగ్గింపు విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో యోచన
గత త్రైమాసికంలో ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలు సంతృప్తికర ఆర్థిక ఫలితాలు సాధించాయన్నారు. కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయన్నారు. రాబోయే రోజుల్లో ధరలు తగ్గించడంపై ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆ రాష్ట్రాలే..
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే పెట్రోల్ ధరలపై గొంతు చించుకుంటున్నాయని, కానీ ఆ రాష్ట్రాల్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని హర్దీప్ తెలిపారు. ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు.