Petrol Price: లీటర్ పెట్రోలు అక్కడ రూపాయి 89 పైసలకే, మన దేశంలో మాత్రం రూ.100కి పైగానే.. ఇతర దేశాల్లో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం
ఈ యుద్ధం తరువాత పలు నిత్యవసరాలు, ఇతర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది
New Delhi, Mar 18: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం తరువాత పలు నిత్యవసరాలు, ఇతర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో చాలా దేశాలలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Price) ఆకాశాన్ని తాకుతున్నాయి. మన దేశంలో కూడా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.
హోలీ పండుగ తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందన్న ప్రచారం రెండ్రోజుల క్రితం నుంచి జరుగుతోంది. అలాగేపెట్రో ధరలు త్వరలో తగ్గే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తన్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు భారీగా ముడిచమురును ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్‌కు తక్కువ ధరకే ముడిచమురు ఇస్తామని ఇప్పటికే రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించడంతో వచ్చే కాలంలో ఇంధన ధరలు తగ్గనున్నట్లు సమాచారం.
మన దేశంలో పెట్రోల్ ధరలు (petrol price in India) రూ.100కి పైగానే ఉన్నాయి. మరి ఇతర దేశాలలో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. పాకిస్తాన్'లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.837 డాలర్లు(సుమారు రూ.63.43) ఉండగా, శ్రీలంకలో ఇది 1.111 డాలర్లు(రూ. 84) వద్ద ఉంది. బంగ్లాదేశ్ దేశంలో $1.035(రూ.78.43) ఉంటే నేపాల్'లో $1.226(రూ.93) గాఉంది. ఇక వెనిజులా (Venezuela) దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $0.025(రూ.1.89)గా (priced at Rs 1.8) ఉంది.
ఆ తర్వాత లిబియాలో ఇంధనం చౌకగా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.032(రూ.2.43)గా ఉంది. ఇతర దేశాలలో పోలిస్తే ప్రపంచంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న దేశం "హాంగ్ కాంగ్". ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ $2.879(రూ.218)గా ఉంది. ఆ తర్వాత నార్వే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్, లిచెన్ స్టెయిన్, జర్మనీ వంటి దేశాలలో ఇంధనం ధర లీటరుకు రూ.200కు పైగా ఉంది.