PM Modi in Prayagraj: 1.60 లక్షల మహిళా లబ్ధిదారుల ఖాతాలకు రూ.1,000 కోట్ల నగదు బదిలీ, యావత్ దేశం యూపీ అభివృద్ధి వైపు చూస్తోందని తెలిపిన ప్రధాని మోదీ
మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు ప్రధాని (PM Modi in Prayagraj) చేరుకున్నారు.
Prayagraj, Dec 21: ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో 1.60 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాలకు రూ.1,000 కోట్లను బదిలీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు ప్రధాని (PM Modi in Prayagraj) చేరుకున్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా,యుమన, సరస్వతీ నదుల సంగమ స్థలి అని మోదీ (PM Modi) ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని అభివర్ణించారు. నేడు ఈ పవిత్ర పట్టణం మహిళలు, వారి శక్తికి ప్రతీకగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.
లక్షకు పైగా మహిళా లబ్ధిదారుల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలు (PM transfers Rs 1000 cr in bank accounts) బదిలీ చేస్తుండడాన్ని గర్వకారణంగా మోదీ పేర్కొన్నారు. కొంత కాలం క్రితం వరకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేని మహిళలు నేడు డిజిటల్ బ్యాంకింగ్ శక్తిని అందిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు. యావత్ దేశం యూపీ అభివృద్ధి వైపు చూస్తోందన్నారు.
Here's ANI Tweet
ఆడ శిశువులను గర్భంలో చంపేయకుండా కాపాడాలన్న లక్ష్యంతోనే భేటీబచావో.. భేటీ పడావో ప్రచారం ద్వారా సమాజంలో అవగాహనకు కృషి చేసినట్టు చెప్పారు. దేశంలోని సగం జనాభా హక్కుల కోసం స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి వేచి చూడగా, ప్రధాని మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాతే అది సాకారమైనట్టు యూపీ సీఎం ఆదిత్యనాథ్ అంతకుముందు సభను ఉద్దేశించి అన్నారు.