PM Modi's Letter To Rickshaw Puller: రిక్షావాలాను సర్‌ప్రైజ్ చేసిన పీఎం మోదీ, కుమార్తె పెళ్లికి ప్రధాని నుంచి లేఖ అందుకున్న కేవత్, త్వరలో ప్రధానిని కలుస్తానంటున్న యుపీ రిక్షావాలా
కాని ఆయన నుంచి అనుకోని బహుమతులు అందుకున్నప్పుడు వారు తన ఆనందాన్ని అందరికీ తెలుపుతుంటారు. అలాంటి సంఘటనే యుపీలో (Uttar Pradesh) చోటు చేసుకుంది. యూపీకి చెందిన ఓ రిక్షా వాలా (Rickshaw puller) భారత ప్రధాని నుంచి ఓ లేఖను అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ రిక్షావాలాను సర్‌ప్రైజ్ చేశారు.
Varanasi, Febuary 16: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అంటే సామాన్యులకు ఎంత ఇష్టమో చాలామందికి తెలియకపోవచ్చు. కాని ఆయన నుంచి అనుకోని బహుమతులు అందుకున్నప్పుడు వారు తన ఆనందాన్ని అందరికీ తెలుపుతుంటారు. అలాంటి సంఘటనే యుపీలో (Uttar Pradesh) చోటు చేసుకుంది. యూపీకి చెందిన ఓ రిక్షా వాలా (Rickshaw puller) భారత ప్రధాని నుంచి ఓ లేఖను అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ రిక్షావాలాను సర్‌ప్రైజ్ చేశారు.
ఏకంగా ప్రధాని నుంచి లేఖ అందుకోవడంతో సదరు రిక్షావాలా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్ డోమ్రీ గ్రామానికి చెందిన కేవత్ రిక్షాతోలుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే అతడి కుమార్తె వివాహం నిశ్చయమైంది. దీంతో అతడు మోదీకి లేఖ రాశాడు. ఫిబ్రవరి 12న జరగనున్న తన కూతురి వివాహానికి వచ్చి ఆమెను ఆశీర్వదించాలంటూ ప్రధాని మోదీకి లేఖ ద్వారా ఆహ్వానం పంపించారు. లేఖపై స్పందించిన మోదీ.. కేవత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మరో లెటర్ రాశారు. జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలంటూ కేవత్ కుమార్తెను ఆశీర్వదించారు.
హౌడీ మోదీని గుర్తు చేసేలా కెమ్ ఛో ట్రంప్
రిక్షావాలా ఏకంగా ప్రధాని నుంచి లేఖ అందోకోవడంతో కేవత్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ‘నేనే స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని కార్యాలయంలో లేఖ అందించాను. ఫిబ్రవరి 8న నాకు వారి నుంచి ప్రత్యుత్తరం రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సమాజంలో చిట్ట చివరన ఉన్న వ్యక్తులను కూడా మోది ఆదరిస్తారని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని సంబరపడిపోయాడు. త్వరలో ప్రధాని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన్ను కుటుంబసమేతంగా కలవాలనుకుంటున్నాని కేవత్ తన మనసులో మాటను బయటపెట్టాడు.