PM Narendra Modi and President Donald Trump during 'Howdy, Modi!' event (Photo Credits: IANS)

New Delhi, February 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు (Donald Trump India Visit) గుజరాత్‌ యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మోతెరాలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్‌ ఛో ట్రంప్‌’గా (Kem Chho Trump) నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్‌?’ అని అర్థం.ఇంతకుముందు నమస్తే డొనాల్డ్ ట్రంప్ (Namaste Donald Trump) అని అనుకున్నారు. అయితే దాని పేరు మార్చి కెమ్ ఛో ట్రంప్ అని పెట్టారు.

ఈ ఈవెంట్ గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్‌ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ (Howdy, Modi) తరహాలోనే ఇది జరగనుంది. దాన్ని తలదన్నేలా ఈ కార్యక్రమం ఉంటుందని ఏర్పాట్లను బట్టి చూస్తే తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భార్య మిలానియా ట్రంప్‌తో కలిసి ఫిబ్రవరి 24న భారత పర్యటనకు వస్తున్నారు. అయితే ఆయన టూర్‌ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (Ahmedabad) నుంచి మొదలవుతోంది.

మోడీ చేతిని ముద్దాడిన కాశ్మీరీ పండిట్, అగ్రరాజ్యంలో నరేంద్రుడికి ఘనస్వాగతం

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ( PM Modi) సొంత రాష్ట్రం గుజరాత్‌కు ట్రంప్‌ రావడంతో అక్కడి ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ (Gujarat Govt) భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తోంది.

భారత్- యూస్ మధ్య వ్యూహాత్మక బంధం

ట్రంప్‌ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు కనిపించకూడదని గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ (Gujarat CM Vijay Rupani) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖర్చు విషయంలో వెనకాడవద్దని కూడా సీఏం సూచించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలని ప్రభుత్వం అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) స్నైపర్‌ బలగాలను మోహరించనుంది.

బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ

ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి.

అమెరికా అధ్యక్షుడికి చిరస్మరణీయంగా గుర్తుండి పోయేలా స్వాగత ఏర్పాట్లు

ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్‌ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్‌ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ పటేల్‌ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్‌ అధికారులు, 65 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, 200 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, 800 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్‌పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్‌లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి.

ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్‌కి దిమ్మతిరిగే కౌంటర్

అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్‌ ఛో ట్రంప్‌’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి.

Howdy, Modi Highlights

ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్‌ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు.