Narendra Modi: పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు, గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కారు, చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి అర్పించిన భారత ప్రధాని
PM Narendra Modi takes Boat Ride in Ganga (Photo Credits: ANI)

Kanpur, December 14: భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని అటల్ ఘాట్(Atal ghat) వద్ద ప్రధాని వద్ద మోడీ సరదాగా షికారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ(NDA) మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ గంగానదీలో పర్యటించారు.ఈ సందర్భంగా తీరంలో ఉన్నవారికి చేయి ఊపుతూ మోడీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

అంతకుముందు చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీలో మోదీ అధ్యక్షతన జరిగిన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. అనంతరం గంగానదిని పరిశీలించారు.అక్కడ అమలవుతున్న స్వచ్ఛ భారత్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మోడీ బోట్‌రైడ్‌కు వెళ్లారు.

PM Modi Takes Boat Ride:

మోడీ సర్కార్ నమామి గంగ ప్రాజెక్టు(Namami Gange Programme) పేరిట గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా గంగానది (River Ganga)పరివాహక ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పర్యటనకు గైర్హాజరయ్యారు.