Vaccine Scam In Bihar: బీహార్లో భారీ కరోనా వ్యాక్సినేషన్ స్కాం వెలుగులోకి, ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంకతో పాటు ఇతర ప్రముఖులు వ్యాక్సినేషన్ వేసుకున్నట్లుగా ఫేక్ జాబితా క్రియేట్ చేసిన సిబ్బంది

ఇ్పటికే 100 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ స్కాం (Vaccine Scam In Bihar) వెలుగులోకి వచ్చింది.

District Magistrate J Priyadarshini. (Photo Credits: ANI)

Patna, Dec 7: దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. ఇ్పటికే 100 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ స్కాం (Vaccine Scam In Bihar) వెలుగులోకి వచ్చింది.

బీహార్‌లోని ఆరోగ్య కేంద్రంలో టీకాలు వేయించుకున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా (PM Narendra Modi, Amit Shah), కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. టీకా గ్రహీతల పేర్ల జాబితా (COVID-19 Tested People in Bihar's Arwal) ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడింది. తాజాగా ఆ జాబితాను పరిశీలిస్తే ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలియగానే ఒక్కసారిగా వ్యాక్సినేషన్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి.

ఈ స్కాం వెలుగులోకి రాగానే ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేశారు. బిహార్‌లోని అర్వాల్‌ జిల్లాలోని కర్పి హెల్త్‌ సెంటర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునేలా ఆరోగ్య కేంద్రాల ప్రజలు ఏర్పాట్లు చేయాలన్నారు. అక్కడ టీకాలు వేసిన వారి పేర్లను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత సమాచారం చూసుకునే వారు. అయితే ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రారాం చెప్పేశారు. వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేధించడానికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా మారు పేర్లతో డేటా క్రియేట్ చేశారు.

Here's PM Narendra Modi, Amit Shah Appear on List of Vaccinated

లక్ష్యాన్ని చేధించడానికి అర్వాల్‌లోని ఆ ఆరోగ్య కేంద్రం వ్యాక్సిన్ గ్రహీతల జాబితాలో ప్రధానమంత్రి, బిజెపి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు మరియు అమెరికా నుండి ప్రవాస నటీమణుల పేర్లు కూడా చోటు సంపాదించాయి. ఇంతకుముందు వ్యాక్సిన్ కుంభకోణం గురించి ప్రత్యర్థులు గళం విప్పారు. ఈ వార్త బహిరంగంగా బయటకు వచ్చిన తర్వాత, అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారని ఆర్జేడీ నేత ఒకరు ట్వీట్ చేశారు.

కరోనా థర్డ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎంఏ, ఒమిక్రాన్ భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ, సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ స్థాయిలో కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు

దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ..జాబితా లిస్ట్ చూశాం. దీనిపై విచారణ ప్రారంభిస్తాం. అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటామని తెలిపారు. ఇది చాలా సీరియస్ విషయం అని మేము అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నామని అలాగే టెస్టుల సంఖ్య పెంచుతున్నామని కొన్ని చోట్ల ఇలాంటివి జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. దీనిపై గట్టిగా విచారణ చేస్తామని అన్నారు. ఇద్దరు ఆపరేటర్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై ల్వరలోనే ఎప్ఐఆర్ నమోదు చేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ ప్రియదర్శిని అన్నారు.