PM Modi Dedicates 3 PARAM Rudra Supercomputers: మూడు సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ, దేశీయంగా రూ. 130 కోట్లతో పరమ రుద్ర కంప్యూటర్ల తయారీ
శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్ల (PARAM Rudra super computers)ను నుంచి ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
New Delhi, SEP 26: దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్ల (PARAM Rudra super computers)ను నుంచి ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు.
Here's the Video
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు. సాంకేతిక విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని తెలిపారు. ఈ సాంకేతిక విప్లవంలో మన వాటా బిట్స్, బైట్స్‌లో కాదు.. టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలన్నారు.
భారతదేశం సైన్స్, టెక్నాలజీ, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సొంతంగా సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌ను నిర్మించడంతో పాటు ప్రపంచంలోని సరఫరా గొలుసులో కీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సైన్స్ ప్రాముఖ్యత కేవలం ఆవిష్కరణలు, అభివృద్ధి వరకే పరిమితం కారాదన్న ప్రధాని.. దేశంలో ఆఖరి పౌరుడి ఆకాంక్షలను సైతం నెరవేర్చేలా ఉండాలన్నారు.