PM Modi Gets Emotional: మోదీనే నాకు దేవుడు, భావోద్వేగానికి గురయిన డెహ్రడూన్ మహిళ, కన్నీటి పర్యంతం అయిన ప్రధాని, పీఎంబీజేపీ కార్యక్రమంలో కరోనాపై పలు సూచనలు

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ప్రధాని మోదీ (PM Modi) కంతడి పెట్టారు. డెహ్రాడూన్ మహిళ దీపా షా (Deepa Shah) మాట్లాడిన మాటలకు మోడీ బావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని క్షణాల పాటు తన్మయానికి గురై మౌనం వహించారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జరిగింది.

PM Modi gets emotional while interacting with beneficiaries of PMBJP (Photo Credits: ANI)

New Delhi, March 7: ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే ప్రధాని మోదీ (PM Modi) కంతడి పెట్టారు. డెహ్రాడూన్ మహిళ దీపా షా (Deepa Shah) మాట్లాడిన మాటలకు మోడీ బావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని క్షణాల పాటు తన్మయానికి గురై మౌనం వహించారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో జరిగింది.

చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు

వివరాల్లోకెళ్తే.. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో (Dehradun) ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషాది పరియోజన (Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana) కార్యక్రమంలో భాగంగా జన ఔషధి కేంద్రాల యజమానులతో, జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డెహ్రాడూన్ కు చెందిన దీపా షా మాట్లాడుతూ.. ''పక్షవాతానికి చికిత్స చేయించడం ఎంత కష్టమో తెలిపారు. ‘‘నాకు 2011లో పక్షవాతం వచ్చింది. నేను మాట్లాడలేకపోయేదాన్ని. నన్ను ఆసుపత్రిలో చేర్చారు. మందులు చాలా ఖరీదైనవి. నేను ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా మందులు తీసుకుంటున్నాను. అంతకుముందు నా మందుల కోసం రూ.5,000 ఖర్చయ్యేది. ఇప్పుడు ఈ పథకం ద్వారా రూ.1,500 ఖర్చవుతోంది. దాదాపు మూడు వేలు మిగులుతోంది. ఆ సొమ్ముతో నేను పళ్ళు, ఇతర వస్తువులు కొనుక్కుంటున్నాను’’ అని తెలిపారు.

PM Narendra Modi Gets Emotional After PMBJP Scheme Beneficiary Bursts Into Tears Narrating Her Story:

‘‘మోదీ గారూ, నేను దేవుడిని చూడలేదు. కానీ నాకు మాత్రం మీరే దేవుడి అవతారం. నేను మీకు కృతజ్ఞురాలిని. ముఖ్యమంత్రి కూడా నాకు సహాయపడ్డారు. వైద్యులు ఆశలు వదిలేశారు, నేను బతకనని చెప్పారు. నేను బతకడం మాత్రమే కాకుండా జనరిక్ మందుల వల్ల ఖర్చులు కూడా తగ్గాయి. మోదీ గారూ, మీరు నాకు దేవుడివంటివారు. నేను మీకు చాలా చాలా కృతజ్ఞురాలిని’’ అని దీపా కన్నీళ్లు కార్చుకుంటూ తెలిపారు.

ఛాయ్ వాలా నుంచి పీఎం దాకా

దీపా షా వ్యాఖ్యలపై మోడీ కంటతడి పెట్టారు. కొన్ని క్షణాల పాటు మౌనం వహించారు. ఆయన గద్గద స్వరంతో ఆమె కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు. అనంతరం కరోనా వైరస్ పట్ల ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలిచ్చారు. వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దన్న మోడీ..షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ప్రతీ ఒక్కరు నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గంటన్నర పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ

జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్చి 7న దేశ వ్యాప్తంగా జన ఔషధి దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 6,200 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటెయిల్ ఫార్మా చెయిన్‌గా గుర్తింపు పొందింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now