Amaravathi, Febuary 13: రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan) సమావేశం అయ్యారు. నిన్న సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధన మొదలగు అంశాల మీద సీఎం వైయస్ జగన్ బుధవారం సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు.
ప్రభుత్వ కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. కాగా ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
మిలీనియం టవర్స్‌కు రూ.19 కోట్లు విడుదల
నవరత్నాల్లో భాగంగా ఈ ఏడాది మార్చి 25న ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాల పంపిణీ చేపడుతున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మోదీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
Here's AP CMO Tweet
ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి నివేదించిన ముఖ్యమంత్రి. pic.twitter.com/r3tJudvle1
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 12, 2020
Hon'ble Chief Minister @ysjagan met with the Prime Minister Shri @narendramodi at his residence in New Delhi, today. @PMOIndia pic.twitter.com/j7mklEaXzf
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 12, 2020
దీంతో పాటుగా సవరించిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) అంచనాలు రూ. 55,549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3320 కోట్లును విడుదల చేసేలా జల వనరుల శాఖను ఆదేశించాలని ఏపీ సీఎం (AP CM YS Jagan) విజ్ఞప్తి చేశారు.
మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరారు.
దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్
అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు.
మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం,విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?
కడప స్టీల్ ప్లాంటు (Kadapa Steel Plant) నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు (Ramayapatnam Port) నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవిస్తూ, కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
పోలవరంపై కొనసాగుతోన్న సస్పెన్స్
ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి
గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలన్నారు.
కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి
హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని వివరించారు.
వేటు పడింది, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్
శాసనమండలి ( (Andhra Pradesh Legislative Council) రద్దుకు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్ చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాలని, మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 (AP Disha Act) పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి సీఎం జగన్ వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీని కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ బయల్దేరి వెళ్లారు.