AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravathi, Febaury 12: ఏపీ రాజధాని పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కర్నూలుకు విజిలెన్స్ కమిషన్ (Vigilance Commission), కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌ ఆఫీసుల తరలింపు, మిలీనియం టవర్స్‌కు రూ.19 కోట్లు విడుదల చేయడం, రాజధాని పనులు నిలుపుదల చేయడంపై హైకోర్టులో (Andhra Pradesh,High Court) విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు వాదనలు విన్న ధర్మాసనం.. కార్యాలయాల తరలింపునకు కారణాలు, స్థల వివరాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

కాగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపును (AP Govt Offices Shifting Row) సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి, అజేయ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా మరికొందరు కామెంట్లు చేశారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి పిటిషనర్లకు హైకోర్టు సీరియస్ అయింది.

దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్

వ్యక్తులను ఉద్దేశించి కోర్టుల్లో పిటిషన్లు ఎలా వేస్తారని..ఇలాంటి అభ్యర్థనలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇటువంటి అంశాల మీద హైకోర్టు ఎందుకు నోటీసులిస్తుందని అనుబంధ పిటిషన్‌లోని అంశాలకు, కోర్టుకు ఏమిటి సంబంధమని హైకోర్టు ప్రశ్నించింది. కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై తదుపరి విచారణను 17కు వాయిదా వేసింది.

మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం,విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?

ఈ సందర్భంగా ఏపీ సీఎంకు ( AP CM YS Jagan) నోటీసులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. వ్యక్తులను ఉద్దేశించి దాఖలు చేసిన అంశాలపై విచారణకు కోర్టులు లేవని అభిప్రాయపడింది. ఇలాంటి అభ్యర్థనలు పిల్‌ కిందకు రావని, సీఎంకు, అధి​కారులకు నోటీసులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ నోటీసులు ఇస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగం చేసినట్టే అని హైకోర్టు పేర్కొంది.